*సిఎం జగన్కు ప్రజారోగ్య వేదిక లేఖ
కోవిక్ వైరస్ మరోసారి విస్తరిస్తున్నందున రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ప్రజారోగ్య వేదిక కోరింది. ఇంటింటి కోవిడ్ సర్వేను మళ్లీ నిర్వహించడంతోపాటు కరోనా టెస్ట్లను పెంచాలని సూచించింది. ఈ మేరకు ప్రజారోగ్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ ఎం. రమణయ్య, ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు సీఎం వైఎస్ జగన్ కుఆదివారం లేఖ రాశారు. కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని హెడ్లైన్ ద్వారా వైద్య సేవలను పునరుద్ధరించాలన్నారు. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలలోనూ కేసుల తీవ్రత పెరుగుతోందని, పక్షం రోజులలో గ్రామీణ ప్రాంతాలలో ఆరు శాతంగా ఉన్న కోవిడ్ పాజిటివిటీ 12 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ముగిశాయని, సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభంకానున్నట్లు, తెలిపారు. పిల్లలను విద్యాసంస్థలకు పంపితే వారం రోజుల్లోనే కేసులు డబుల్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున విద్యా సంస్థలకు సెలవులను పొడిగించాలని, ఆన్లైన్లో తరగతులను నిర్వహించాలని కోరారు. ఇతరరాష్ట్రాలలో ఇప్పటికే సెలవులను పొడిగించారని, రాష్ట్రంలో మాత్రం అలాంటిదేదిలేదని ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అన్ని పీహెచ్, అర్బన్ హెల్త్ సెంటర్లలో తగినంత మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించాలని, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, బెడ్లు, ల్యాబ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని, ప్రైవేటు ఆసుపత్రులలో చార్జీలను నియంత్రించాలని లేఖలో పేర్కొన్నారు.. కరోనా వ్యాక్ నేషన్ 64 శాతమే పూర్తయిందని, ఇంకా 36 శాతం మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉందని, వారిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని లేఖలో వారు వివరించారు.
0 comments:
Post a Comment