ఫ్యాప్టో ఆందోళనలకు సంపూర్ణ మద్దతు -సిపిఎస్ ఉద్యోగుల సంఘం

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) చేపట్టనున్న ఆందోళనలకు ఎపిసిపిఎస్ ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించాలని, పాత హెచ్ఎర్ఎ శ్లాబులను కొనసాగించాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 20న కలెక్టరేట్ల ముట్టడి, 28న చలో విజయవాడ కార్యక్రమాలల్లో సిపిఎస్ ఉద్యోగులందరూ పాల్గొనాలని ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ మరియదాసు, ఎం రవికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అశుతోష్ మిశ్రా ఇచ్చిన పిఆర్సి నివేదికలో కచ్చితంగా సిపిఎస్ రద్దుపై నిర్ణయం చేసి ఉంటారని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకనే ప్రభుత్వం ఆ నివేదికను బయట పెట్టడం లేదన్న అనుమానాలు సిపిఎస్ ఉద్యోగుల్లో రేకెత్తుతున్నాయని. పేర్కొన్నారు. తక్షణమే మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top