Botsa Satyanarayana : మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని ఉద్యోగులను హెచ్చరించారు మంత్రి బొత్స సత్యనారాయణ. సమస్యల పరిష్కారానికి నాలుగు మెట్లు దిగామని..దాన్ని అలుసుగా తీసుకోవద్దని ఆయన తీవ్రంగా మాట్లాడారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదన్న బొత్స.. ప్రభుత్వం ఘర్షణను కోరుకోవడం లేదని అన్నారు. చర్చలకు పిలిచినా ఉద్యోగులు రాకపోవడం దారుణమన్న బొత్స..
ఉద్యోగులు రాజకీయ ఆలోచన చేస్తున్నారా.? అని ప్రశ్నించారు. జీతాలు పడితే కదా పెరిగింది, తగ్గింది తెలిసేది అన్న మంత్రి బొత్స.. జీతం తగ్గితే పేస్లిప్ తీసుకుని ప్రజలకు చూపించొచ్చు కదా అని ఆయన నిలదీశారు. ఉద్యోగులు చర్చలకు వస్తారని రోజూ ఎదురుచూడాల్సిన అవసరం లేదని బొత్స తేల్చిచెప్పారు
0 comments:
Post a Comment