Child Care Leave: చైల్డ్ కేర్ సెలవు సర్వీసులో మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా?


Child Care Leave: చైల్డ్ కేర్ సెలవు సర్వీసులో మూడు సార్లు మాత్రమే  వాడుకోవాలా?

సందే : చైల్డ్ కేర్ సెలవు సర్వీసులో మూడు సార్లు మాత్రమే  వాడుకోవాలా? ఇప్పటికే రెండు దపాలు కలిపి మొత్తం 25 రోజులు వాడుకొన్నాను. మా ప్రదానోపాద్యాయుల వారు "మూడో సారి మిగతా అన్నీ వాడుకోవాలనీ లేకపోతే మురిగి పోతాయని" అంటున్నారు. సరియేనా? 

సమా: కాదు. చైల్డ్ కేర్ లీవ్ పై విడుదల చేసిన ఉత్తర్వు G.O.Ms.No.132 Finance (HR-IV-FR) Dept Dated 06.07.2016 లోని పేరా 3 (a) లో ఇలా ఉన్నది Child Care leave of two months can be sanctioned in not less than 3 spells to look after two children up to the age of 18 years. మూడుసార్లకు తక్కువ కాకుండా అంటే మొత్తం 60 రోజులు ఒకే సారి లేదా రెండు సార్లు వాడుకోరాదు. దఫాదఫాలుగా, మూడు ఆపైన ఎన్ని దపాల్లోనైనా వాడుకోవచ్చునని అర్థము

సందే : ఒక మహిళా ఉద్యోగి 25-10-2021 నుండి 8-11 2021(15 రోజులు) వరకు చైల్డ్ కేర్ సెలవు పెట్టినది. 24వ తేదీ ఆదివారము. ఆ రోజు కూడా చైల్డ్ కేర్ సెలవుగా పరిగణింపబడుతుందా?

సమా: G.O.Ms.No.132 Finance (HR-IV-FR) Dept. Dated. 06.07.2016లోని 3(g) పేరాలో చైల్డ్ కేర్ సెలవును Earned leaveగా పరిగణించ బడాలని ఉన్నది. ఆ ప్రకారం ఆదివారము (24-10-2021) Holdiay గానే పరిగణింపబడుతుంది. leaveగా కాదు (Holidays can be prefixed and suffixed to leave subject to the condi tions under A.P F.R. 68)

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top