కొత్త Prc జీవోలను రద్దు చేయాలని కోరుతూ AP High Court లో ఉద్యోగ సంఘాలు గురువారం నాడు పిటిషన్ దాఖలు చేశాయి. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గిస్తూ Andhra pradesh జీవో జారీ చేయడంపై గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ గురువారం నాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.విభజన చట్టం ప్రకారంగా బెనిఫిట్స్ తగ్గించవద్దని ఆ పిటిషన్ లో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ విషయమై జారీ చేసిన జీవోలను నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఏపీ NGOతో పాటు ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సహా పలు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళనకు సిద్దమంటూ ప్రకటించాయి.
0 comments:
Post a Comment