Income Tax | ఈ ఐదింటిని నగదుతో చేస్తే... మీ ఇంటికి ట్యాక్స్ నోటీసులొస్తాయ్

 Income Tax ఈ ఐదింటిని నగదుతో చేస్తే... మీ ఇంటికి ట్యాక్స్ నోటీసులొస్తాయ్

1) నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు హెచ్చరికలు జారీ చేస్తోంది. గత కొన్నేళ్లుగా నగదు లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ కట్టుదిట్టం చేస్తోంది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, బ్రోకర్ ప్లాట్‌ఫామ్‌లు వంటి పలు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లపై చేసే నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కన్నేసి ఉంచింది.

బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, బ్రోకరేజ్ సంస్థలు, ప్రాపర్టీ రిజిస్ట్రార్ల వద్ద పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేస్తే.. మీరు ఆదాయపు పన్ను శాఖకు తెలుపాల్సి ఉంటుంది. ఒకవేళ అలా తెలుపని పక్షంలో మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. మీ ఇంటికే పన్ను నోటీసులు వస్తాయి. మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే ఐదు నగదు లావాదేవీలేమిటో ఓసారి చూద్దాం...

2) బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీలు)... 

ఎఫ్‌డీలో ఒకే ఏడాది లేదా ఒకసారి కంటే ఎక్కువ రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే.. ఆ మనీ ఎలా వచ్చిందని ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని కోరే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో, ఎఫ్‌డీల్లోకి మనీని ఆన్‌లైన్ ద్వారా లేదా చెక్ ద్వారా డిపాజిట్ చేస్తే మంచిది.

3) బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు..

ఒక ఏడాదిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే.. ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది. కరెంట్ అకౌంట్ల గరిష్ట పరిమితి రూ.50 లక్షలుగా ఉంది.

4) ప్రాపర్టీ లావాదేవీలు..

ప్రాపర్టీ రిజిస్ట్రార్ కోసం నగదు రూపంలో భారీ లావాదేవీలు చేసినా కూడా ఆదాయపు పన్నుశాఖకు తెలుపాలి. రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీని నగదు రూపంలో కొంటే.. ప్రాపర్టీ రిజిస్ట్రార్ తరఫున ఆ సమాచారం ఆదాయపు పన్నుశాఖకు వెళ్తోంది.

5) షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్లు, బాండ్లు..

షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు, బాండ్ల కొనుగోళ్లను కూడా నగదు రూపంలో చేపడితే.. మీరు సమస్యలలో ఇరుక్కుంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.10 లక్షల వరకే నగదు లావాదేవీలు చేసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ మీరు వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేయకపోవడమే మంచిది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top