జనగణన’లో సమాధానాలు చెప్పాల్సిందే: కేంద్రం



చట్టం ప్రకారం ప్రతి భారతీయుడు జనగణన సమయంలో ఆయా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జనగణన  విషయంలో లోక్‌సభలో సభ్యు లు అడిగన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ మంగళవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. జనగణన కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని తెలిపారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)ను స మర్థంగా రూపొందిస్తామన్నారు. జనగణన ప్రక్రియను పర్యవేక్షించడానికి రాష్ట్రాలు అధికారులను నియమిస్తారని తెలిపారు. కాగా, జనగణన మొదటి దశ ప్రక్రియ 2020, ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జరగా ల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జనగణన సంబంధించి కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించలేదు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top