గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పై మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ 1వ బ్లాక్ లో ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ SS రావత్ మరియు ఇతర సీనియర్ అధికారు లతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు సీపీఎస్ స్కీమ్ పై ప్రజేంటేషన్ ఇచ్చారు. సంబంధిత ఉద్యోగులను భాగస్వాములను చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు, సంబంధిత ఉద్యోగుల సంఘాలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రుల బృందం, అధికారులు సంబంధిత ఉద్యోగుల సంఘాలకు ప్రజెంటేషన్ ఇవ్వాలని, ఆ తర్వాత చర్చలు జరపాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియ 4 ఏప్రిల్ 2022 నుండి ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
జారీ చేసినవారు: కమిషనర్, సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్
0 comments:
Post a Comment