*'యాప్' ద్వారా పేర్ల నమోదుకు అవకాశం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలను అందించనున్నారు.ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) చర్యలు చేపట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
కాలుష్య నియంత్రణలక్ష్యంగా..
పెట్రోలు/డీజిల్‌తో నడిచే వాహనాల వినియోగంతో కాలుష్య సమస్య తలెత్తుత్తున్న నేపథ్యంలో బ్యాటరీతో నడిచే వాహనాలను పలు వ్యాపార సంస్థలు తయారుచేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. నెలవారీ ఖర్చు బాగా తగ్గడం, నిర్వహణ వ్యయం పెద్దగా లేకపోవడంతో ఇటీవల ఈ తరహా వాహనాలను కొనేవారి సంఖ్య బాగా పెరిగింది. వాహనం ఖరీదు రూ.70 వేల నుంచి రూ.1.10 లక్షల వరకు ఉండనుంది.
30 వేల మందికి ప్రయోజనం
'ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 30 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా తమ చరవాణుల్లో 'ప్లేస్టోర్' ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాహనం కోసం 08812-230285 నంబరులో సంప్రదించొచ్చు. లేదా డెవలప్‌మెంట్ అధికారి వంశీకృష్ణను 77990 24821 నంబరులో సంప్రదించాలి..i- వెబ్‌సైట్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు' అని నెడ్‌క్యాప్ సమన్వయకర్త డీవీ ప్రసాద్ కోరారు.
'యాప్' ద్వారా బుకింగ్
ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాటరీ వాహనాలను వాయిదాల పద్ధతిలో అందించేందుకు నెడ్‌క్యాప్ యాజమాన్యం కొన్ని ప్రైవేటు సంస్థలతో ఎంవో కుదుర్చుకుంది. పేర్లు నమోదు చేసుకునేందుకు నిజువిళినిదీదితిశి పేరుతో యాప్‌ను రూపొందించింది. ఈఎంఐ విధానంలో మొదటి వాయిదా సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 36 నుంచి 40 నెలల కాలపరిమితితో కూడిన ఈఎంఐలను చెల్లించాలి. ఇప్పటి వరకు సుమారు 350 మంది ఎన్‌ఐసీ ద్వారా పేర్లు నమోదు చేయించుకున్నారు.
Playstore App :evnredcap
Login with your Employee ID and DDO code .
Official Website: www.evnredcap.in
0 comments:
Post a Comment