రాబోయే రోజుల్లో రాష్ట్రాలు తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోవచ్చేమో : మమతా బెనర్జీ

 దేశంలో ఇంధనం, నిత్యావసరాల ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నా వాటి నియంత్రణకు కేంద్రం ఏమీ చేయడంలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.పెరిగిపోతున్న ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్న దీదీ.. రాబోయే రోజుల్లో రాష్ట్రాలు తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోవచ్చేమోనని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ బకాయిల్ని కేంద్రం వెంటనే చెల్లించాలని కోరారు. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధించేందుకు సీబీఐ, ఈడీలను ఉపయోగించడానికి బదులుగా ధరలు తగ్గించే మార్గమేంటో చూడాలంటూ ఆమె వ్యంగ్య బాణం విసిరారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top