సాంఘిక సంక్షేమ శాఖ గ్రామ సచివాలయం సంబంధించిన వివరాలు- ఉత్తరవులు జారీ, - - సంక్షేమం మరియు విద్యా సహాయకుని విధుల జాబితా
C. విద్యా శాఖ కార్యక్రమాలపై జాబ్ చార్టు
1. 5-15 సంవత్సరముల వయస్సు గ్రూపులో పాఠశాల వదలి వేసిన వారు / అసలు పాఠశాలలో నమోదు కాని పిల్లలను గుర్తించడం.
2. వారిలో వయస్సుకు అనుగుణంగా విద్యా స్రవంతి లోనికి తెచ్చుటకు దగ్గరలో ఉన్న ప్రత్యేక రెసిడెన్షియల్ శిక్షణా కేంద్రాలు (RSTC), ప్రత్యేక నాన్ రెసిడెన్షియల్ శిక్షణా కేంద్రాలలో (NRSTC) కాని చేరుటకు గల అవకాశాలపై అవగాహన కల్పించడం. అవసరమైతే వాటిలో చేర్పించుటకు కృషి చేయుట.
3. NRSTC/RSTC లు సందర్శించి విద్యా విషయక మార్గదర్శకాలు ఇవ్వడం.
4. పాఠశాల మేనేజ్ మెంటు కమిటి / ఉపాధ్యాయ తల్లి దండ్రుల సమావేశానికి హాజరు కావడం
5. విద్యార్ధులు విద్యా ఫలితాల గురించి (అభ్యసన సామర్ధ్యం గురించి) తల్లిదండ్రులకు సమాచారము అందించడం.
6. తక్కువ అభ్యసన స్థాయి గల విద్యార్ధుల వివరాలు తరగతి ప్రధానోపాధ్యాయుడు/తరగతి టీచరు నుండి సేకరించి ప్రత్యామ్నాయ బోధన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించడం.
7. గ్రామాలలో పదవ తరగతి (ఎస్.ఎస్.సి) ఉత్తీర్ణత కాని విద్యార్ధులను గుర్తించి, వారు ఉత్తీర్ణత చెందుటకు మామూలు పద్ధతి ద్వారా లేదా అవసరం అయినచో AP ఓపెన్ స్కూల్ (APOS) ద్వారా అట్టివారు SSC లో అర్హత సాధించుటకు మార్గదర్శకత్వం ఇవ్వడం
8.ఎస్.ఎస్.సి పూర్తి చేయుటకు అనాసక్తి చూపించువారికి స్కిల్ డెవలప్మెంట్ (నైపుణ్యాభివృద్ధి) కోర్సుల గురించి మార్గదర్శకం ఇవ్వడం.
9. అంగన్వాడీ కేంద్రాలలోని 5 సంవత్సరాలు నిండిన పిల్లలు ప్రాధమిక పాఠశాలలో 1వ తరగతిలో 100% నమోదుకు సహకరించడం.
10. స్కూలు విద్యా వ్యవస్థలో గృహ పంపిణీ లేనందున ప్రభుత్వం చే మంజూరు అయ్యే పథకాలు అయిన నోట్ బుక్స్, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన వసతి, శానిటరీ న్యాప్కిన్లు, మరియు సైకిళ్ళు మొదలగునవి. అర్హులకు చేరుటకు కృషిచేయుట.
11. అమ్మ ఒడి పథకముతో తల్లుల ఎంపిక లో ప్రధాన పాత్ర పోషించడము.
గ్రామ వార్డు సచివాలయ సంక్షేమ అధికారి మరియు ఉపాధ్యాయులు మధ్య జరిగిన సంభాషణ వీడియో Click Here to Watch
0 comments:
Post a Comment