జూన్ 21న అమ్మఒడి?*గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే ప్రాసెస్

 *పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలున్నా ఓకే

 రాష్ట్రంలో గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి 'జగనన్న అమ్మఒడి' నిధు లు జూన్ 21న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాల రూపకల్పనలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్నారు. అందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన బెనిఫిషియరీ అవుట్ రీచ్ మొబైల్ అప్లికేషన్లో పథకానికి సంబంధించిన నిబంధనల మేరకు లబ్ధిదారుల అర్హతలు ఉన్నాయా లేదా అనేవి సేకరిస్తున్నారు. అమ్మఒడికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ నుంచి కేవలం హాజరు వివరాలు) మాత్రమే అందించనుంది. మరోవైపు లబ్ధిదారులు నివాసాల్లో కరెంట్ బిల్లులు 300 యూనిట్లు దాటాయా లేదా అనే వివరాలతోపాటు, వారికి ఉన్న రేషన్ కార్డు, వాహనాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించి అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. దాదాపు 42 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ ఊళ్లకు వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమ్మఒడిలబ్దిదారుల జాబితాలకు సం బంధించిన మూడు జాబితాలను గ్రామ, వార్డు సచివాల యాల ఉద్యోగులే సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ పథకం కింద తప్పుగా నమోదైన విద్యార్థి వివరాల సవర ణలకూ ఒక దరఖాస్తు రూపొందిం చినమోదు చేస్తున్నారు.

దరఖాస్తుల ద్వారా వివరాల సేకరణ..

అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థులు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో దేనికి సంబంధించిన వారు, జిల్లా, మండలం, విద్యార్థి చదువుతున్న స్కూల్ వివరాలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నమోదు చేస్తున్నారు. వివరాలు తప్పుగా ఉన్న విద్యార్ధులకు సంబంధించి రేషన్ కార్డు నంబర్, తల్లి, సంరక్షకుల పేరు, ఆధార్లతోపాటు విద్యార్థుల ఆధార్, స్కూల్ యూడైన్ కోడ్, బ్యాంక్ ఖాతాల వివరాలను దరఖాస్తుల ద్వారా సేకరిస్తున్నారు.

పోస్టల్ బ్యాంకు ఖాతాలకూ..

అమ్మఒడి పథకం నిధులు జమ చేసేందుకు ప్రస్తుతం విద్యార్థుల తల్లులకు బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తు న్నారు. దీనికి అదనంగా ఈ ఏడాది నుంచి పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలున్నా వాటిలో జమ చేయాలని ప్రభు త్వం నిర్ణయిం చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఆమోదిస్తా మని సర్క్యులర్ విడుదల చేశారు.

పోస్టల్ బ్యాంక్ ఖాతాలు జీరో అకౌంట్లు కావడంతో లబ్ధిదారులు ఎలాంటి కనీస మొత్తం లేకుండా ఖాతాలు తెరిచి, ఉపయోగిం చుకోవచ్చు. ఈ మేరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి విద్యాశాఖ మంత్రికి ఒక లేఖ కూడా రాశారు. అలాగే రెగ్యులర్ బ్యాం కుల్లో ఏ విధంగా వివిధ రకాల నగదు జమ చేస్తారో.. ఆసౌకర్యాలన్నీ పోస్ట్బ్యంకులో కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు ఈ సదుపాయం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top