సెలవుల సద్వినియోగం కోసం ఓ యాప్ నేర్చుకోవడం , చదవడం నేర్పేలా ప్రణాళిక గూగుల్తో సమగ్ర శిక్ష భాగస్వామ్యం

పాఠశాల విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియో గం చేసుకునేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థుల్లో పఠనా సామర్థ్యా లను నేర్చుకునే తత్వాన్ని పెంపొందించేలా ఒక యాప్ను అందుబాటులోకి తెచ్చిం ది. అందుకోసం గూగుల్ సంస్థతో రాష్ట్ర సమగ్ర శిక్ష ఒ క భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గూగుల్ సంస్థఎడ్యుకేషన్ విభాగంలో ప్రవేశపెట్టిన 'గూగుల్ రీడ్ అలాంగ్' యాపు విద్యార్థులు ఉపయోగించుకునేలా భాగస్వామ్యం కుదుర్చుకు న్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రిసెల్వి తెలిపారు. సమగ్ర శిక్షా పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా 'గూగుల్ రీడ్ అలాంగ్' యాప్ను ప్రారంభిం చేందుకు గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ యాప్ను సరైన విధంగా విద్యార్థులు ఉపయోగించగలిగేలా చూసేందుకు ఉపాధ్యాయులు, అధికారులకు ఆన్లైన్లో శిక్షణ సమావేశాలనూ నిర్వహిస్తున్నారు. అలాగే 'గూగుల్ రీడ్ అలాంగ్' యాప్ ఉపయోగాలను వివరించడానికి జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయులతో బుధవారం ఒక ఆన్లైన్ శిక్షణా సమావేశం నిర్వహించారు.1 నుంచి ఆరో తరగతి విద్యార్థులకు..

వేసవి సెలవుల్లో ఒకటి నుంచి ఆరో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాన్ని పెంచడం కోసం, వారు వినోదభరితంగా, ఆకర్షణీయంగా నేర్చుకోవ డానికి, చదవడానికి ఏర్పాటు గూగుల్ రీడ్ అలాంగ్ యాప్ను ఉపయోగిం చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ యాప్లో గూగుల్ అధునాతన స్పీచ్ టు- టెక్స్ట్, వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీల ఆధారంగా స్నేహపూర్వక అభ్యసన కోసం 'దియా' యానిమేటెడ్ అసిస్టెంట్ ఉంటుంది. విద్యార్థులు బిగ్గరగా చదివే సమయంలో దియా విని ప్రతిస్పందిస్తూ కొత్త పదాలు, కష్టమైన పదాలు ఏ విధం గా ఉచ్ఛరించాలనే విషయంలో సహాయపడుతుంది. విద్యార్థులకు ఉపయోగపడేఈ యాప్ను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ కె. వెట్రిసెల్వి కోరారు. ఎటువంటి ప్రకటనలు లేకుండా ఉచితంగా, ఆఫ్ లైన్, ఆన్లైన్ విధానాల్లో ఈ యాపను వినియోగించుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీషుతో పాటు 11 భాషల్లో వెయ్యికి పైగా బొమ్మలు, కథలు, ఆటలు వంటివి ఇందులో అందుబాటులో ఉంటాయి. అలాగే రాబోయే రోజుల్లో పాఠ్య పుస్తకాల్లోని కథలు, కొత్త విషయాలు తదితర అంశాలను కూడా యాప్లో అందు బాటులోకి రానున్నాయి. ఈ యాప్ గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అవగాహన కలిగించడంతోపాటు వేసవి సెలవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా సూచిస్తున్నారు. ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉపాధ్యాయులు సరైన అవగాహన కల్పించి, వేసవి సెలవుల్లో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఎస్పీడీ కోరారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునఃప్రారంభించిన తర్వాత కూడా ఉపాధ్యాయుల సహకారంతో తరగతి గదిలో ఈ యాప్ వినియోగాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

Read also:

Read along Partner Codes

Read along android appPosted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top