వాలంటీర్లతో బెనిఫిషియరీ అవుట్ రీచ్ సర్వే

★ అమ్మఒడి పథకానికి సంబంధించిన నగదు లబ్ధిదారులకు అందాలంటే ఈకేవైసీ తప్పనిసరి. జూన్ లో పథకం నగదును అర్హుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లతో బెనిఫిషియరీ అవుట్ రీచ్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.ప్రత్యేక యాప్ ద్వారా ..

★ విద్యార్థుల తల్లుల వివరాలు ఈ కేవైసీ చేసి ఉండాలని నిర్దేశిస్తూ గ్రామ , వార్డు సచివాలయాల వాలంటీర్లకు ప్రత్యేక యాపు విడుదల చేశారు.

★ సచివాలయాల వారీగా తల్లుల వివరాలను యాప్లో అందుబాటులో ఉంచారు. బెనిఫిషియరీ అవుట్డోచ్ సర్వే పేరిట విద్యార్థుల తల్లుల వివరాలను వాలంటీర్లు నవీకరిస్తున్నారు. విద్యార్థి హాజరు ఆధారంగా అమ్మఒడి నగదు ఖాతాలకు జమ అవుతుంది .

ఏం చేయాలంటే ..

 ★ అమ్మఒడికి సంబంధించి అనేక మంది లబ్ధిదారులు అర్హత ఉన్నా ప్రభుత్వ లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఈ విషయాలను సరిచూసుకోవాలి.

★ తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్, చరవాణి నంబరు అనుసంధానం ( ఈకేవైసీ ) అయి ఆ ఖాతా, పాఠశాల లాగిన్ నమోదైనది ఒకటే అయి ఉండాలి.

★ దానికి ఎన్ పీసీఐ అనుసంధానమై ఉండాలి. 

★ ఈ వివరాలను బ్యాంకుకు వెళ్లి సరి చూసుకోవాలి. 

★ రెండు అంతకంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఒక ఖాతాకు మాత్రం ఎన్పీసీఐ అనుసంధానం చేయించాలి. 

★ అదే ఖాతా పాఠశాల లాగిన్ నమోదై ఉండాలి. 

★ ఇదంతా పూర్తయిన తర్వాత వాలంటీరు దగ్గర ఆధార్ ఈ కేవైసీ చేయించాలి.

★ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నమోదైందీ లేనిదీ సరిచూడాలి.

★ మ్యాపింగ్ తల్లి, విద్యార్థి వివరాలు, వయసు తదితర వివరాలు అప్డేట్ అయిందీ లేనిదీ సరిచూసుకోవాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top