Petrol Pump Free Services Available: పెట్రోల్ పంపులో కొన్ని అవసరమైన సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాలి

Petrol Pump Free Services Available: పెట్రోల్ పంపులో కొన్ని అవసరమైన సౌకర్యాలు ఖచ్చితంగా ఉంటాయి. పెట్రోల్‌, డీజిల్‌ కోసం వెళ్లే వాహనదారులకు ఈ ఆరు సదుపాయాలు (Facilities) అందుబాటులో ఉంటచేయాలిఒక వేళ ఈ సౌకర్యాలు లేకపోతే ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఈ సదుపాయాలు పూర్తిగా ఉచితమే. ఇండియన్‌ ఆయిల్‌ మార్గదర్శకాల ప్రకారం పలు నియమ నిబంధనలు రూపొందించబడ్డాయి. మీరు పెట్రోల్ పంప్‌లో ఉచితంగా సౌకర్యాలు పొందకపోతే మీరు పంపు యజమానిపై ఫిర్యాదు చేయవచ్చు. అంటే పెట్రోల్ పంపుల యజమానులు ఈ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. మరి బంకుల్లో ఎలాంటి ఉచిత సదుపాయాలో చూద్దాం.

ఎయిర్‌ చెక్‌: అన్ని పెట్రోల్ పంపుల్లో వాహనాల టైర్లలో గాలి నింపే యంత్రాలు ఉంటాయి. ఈ సదుపాయం ఉచితమే. టైర్లలో గాలి నింపేందుకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ఉచిత సదుపాయం కోసం పంపు యజమాని తరపున ఓ వ్యక్తిని నియమిస్తారు.

తాగునీటి సౌకర్యం: పెట్రోల్ పంపు వద్ద స్వచ్ఛమైన తాగునీరు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పంపు యాజమానులపై ఉంది. పెట్రోల్‌ కోసం వచ్చినప్పుడు దాహం కోసం తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పంపు యజమానులు వాటర్‌ కోసం ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేస్తారు. కొన్ని పంపులలో ప్రజలు చల్లటి నీరు తాగడానికి రిఫ్రిజిరేటర్స్‌ కూడా ఉంటాయి. ఇది కూడా ఉచిత సదుపాయంలో భాగమే.

టాయిలెట్స్: పెట్రోల్ పంపు వద్ద టాయిలెట్ సౌకర్యం ఉండాలి. ఈ సౌకర్యం వినియోగదారులకు ఉచితంగా అందించబడుతుంది. ఇందు కోసం శుభ్రంగా ఉండేలా పంపు యజమాని చర్యలు తీసుకోవాలి. ఇందులో ఏదైనా సమస్య ఉంటే వినియోగదారుడు దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు.

ఫోన్‌ సదుపాయం: మీరు అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా కాల్ చేయాల్సి వస్తే పెట్రోల్ పంపులో ఈ సౌకర్యం ఉచితంగా అందించబడుతుంది. ఇందు కోసం పంపు యజమాని ఉచితంగా ఫోన్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ప్రథమ చికిత్స: పెట్రోల్‌ పంపుల్లో ప్రథమ చికిత్సకు సంబంధించి సదుపాయం తప్పకుండా ఉండాలి. పెట్రోల్‌, డీజిల్‌ కోసం వచ్చే వారికి ఏదైనా గాయాలు అయినా అక్కడే ప్రథమ చికిత్స చేయించుకోవచ్చు. ప్రతి పెట్రోల్ పంపులో ఈ సౌకర్యాన్ని ఉచితంగా అందించాలి. ఏదైనా సంఘటన అకస్మాత్తుగా జరిగితే, ఆ వ్యక్తి సమీపంలోని ఆసుపత్రికి వెళ్లే ముందు పెట్రోల్‌ పంపుకు వెళ్లి ప్రథమ చికిత్స చేసుకోవచ్చు.

నాణ్యత తనిఖీ: మీరు పెట్రోల్ పంపు వద్ద పెట్రోల్‌ను కూడా తనిఖీ చేసుకునే హక్కు ఉంటుంది. ఇందులో క్వాలిటీతో పాటు క్వాంటిటీని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా పెట్రోల్ పంపులో అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఇసుక లేదా ఫైర్ సేఫ్టీ స్ప్రేతో నిండిన బకెట్లతో సహా మంటలను ఆర్పే పరికరాలు వంటివి తప్పకుండా ఉండాలి. పెట్రోల్, డీజిల్‌ ధరలకు సంబంధించి ఓ పట్టికను ఏర్పాటు చేయాలి. రోజువారీగా ధర అప్‌డేట్స్‌తో కూడిన డిస్‌ప్లేను ఏర్పాటు చేయాలి

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top