ఆధార్ కార్డ్ హోల్డర్లు ఇక ప్రతీ సర్వీస్ కోసం ఆధార్ సేవా కేంద్రానికో (Aadhaar Seva Kendra), ఆధార్ సెంటర్‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ గంటల తరబడి క్యూలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో కూర్చొనే ఆన్‌లైన్‌లో కొన్ని సేవల్ని పొందొచ్చు. డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అంటే పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలను ఆన్‌లైన్‌లోనే పొందొచ్చని యూఐడీఏఐ ట్వీట్ చేసింది. ఎంఆధార్ యాప్‌లో (mAadhaar App) వీటిని మార్చుకోవచ్చని తెలిపింది.
ఆధార్ కార్డ్ హోల్డర్లు పేరును రెండుసార్లు మార్చుకోవచ్చు. అయితే చిన్న మార్పుల్నే అనుమతిస్తారు. జెండర్‌ను ఒకసారి మార్చుకోవచ్చు. పుట్టినతేదీని కూడా ఓసారి మార్చుకోవచ్చు. అడ్రస్ ఎన్నిసార్లైనా మార్చవచ్చు. ప్రతీ రిక్వెస్ట్‌కు రూ.50 చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ వివరాలను కూడా అప్‌డేట్ చేయడం సాధ్యం. మరి ఎంఆధార్ యాప్‌లో పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ మార్చుకోవచ్చు
0 comments:
Post a Comment