JVK Kits 2022-23 Guidelines: సమగ్ర శిక్ష 'జగనన్న విద్యా కానుక - 2022-23' విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు - సమగ్ర శిక్షా మార్గదర్శకాలు జారీ చేయుట Rc.16021 Dt: 10-05-2022
JVK Kits 2022-23 Guidelines 'జగనన్న విద్యా కానుక - 2022-23' విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు - సమగ్ర శిక్షా మార్గదర్శకాలు జారీ చేయుట Rc.16021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, మండల ప్రజాపరిషత్,జిల్లా పరిషత్, మున్సిపల్, గురుకులాలు, ఆశ్రమ, ఎయిడెడ్, మోడల్, కేజీబీవీ. రిజిస్టర్డ్ మదర్సాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్రశిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్ల సరఫరా ప్రారంభించబడింది.
జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ఈ క్రింది ఏర్పాట్లను తప్పనిసరిగా అమలు చేయవలెను.
1. జిల్లా స్థాయిలో జగనన్న విద్యాకానుక కోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి.
2.సప్లయర్స్ నుండి వస్తువుల డెలీవరి షెడ్యూల్ ను తీసుకుని సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు /మండల విద్యాశాఖాధికారి వారికి ఏ రోజు ఏ వస్తువులు అందుతాయో సమాచారం అందించాలి.
3. జగనన్న విద్యాకానుక వస్తువులకు సంబంధించి డెలివరీ చలానాలను తప్పనిసరిగా పొందవలెను.
4.ప్రతి రోజు జిల్లాలో విద్యాకానుక వస్తువుల స్వీకరణ గురించి నివేదిక పంపించవలెను.
5. పాఠ్య పుస్తకాలు, వర్క్స్ బుక్స్ మరియు డిక్షనరీలు స్కూల్ కాంప్లెక్సులకు చేర్చి పాఠశాల పునఃప్రారంభానికి ముందుగా 'స్టూడెంట్ కిట్' తయారు చేయాలి.
ముఖ్యంగా గమనించవలసిన విషయాలు.
# 'జగనన్న విద్యాకానుక'లో భాగంగా మూడు జతల యూనిఫాం క్లాత్, వర్క్ బుక్స్, నోటు పుస్తకాలు,పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు& రెండు జతల సాక్సులు, బెబ్బు, బ్యాగు, నిఘంటువులను కిట్ రూపంలో అందించవలసి ఉంటుంది.
#జగనన్న విద్యాకానుక'లో భాగంగా నోటు పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు మరియు ఒక జత బూట్లు,రెండు జతల సాక్సులు స్కూల్ కాంప్లెక్సులకు, యూనిఫాం క్లాత్ మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు, డిక్షనరీలు జిల్లా కేంద్రాలకు అందజేస్తారు. జగనన్న విద్యాకానుక కిట్లోని వస్తువులు జిల్లా / మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు /స్కూల్ కాంప్లెక్సులకు వచ్చే ముందు జిల్లా కంట్రోల్ రూమ్ సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు/ మండల విద్యాశాఖాధికారి వారికి సమాచారం అందిస్తారు.
జగనన్న విద్యాకానుక' కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా మండల పరిధిలో మండల విద్యాశాఖాధికారి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, సిబ్బంది పరస్పర సహకారంతో పని చేయాలి. సమష్టి బాధ్యతగా తీసుకోవాలి. అందుకున్న వివిధ వస్తువులకు సంబంధించిన వివరాలను స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులకు అందించబడిన వారి లాగిన్ నందు నమోదు చేయాల్సి ఉంటుంది.
తాజా సమాచారం కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి:
https://chat.whatsapp.com/Kq6tsFUcZtTFyPKw6STZuk
0 comments:
Post a Comment