జేఈఈ మెయిన్ తొలిదశ పరీక్షలను ఈ నెల 23 నుంచి 29 వరకూ దేశవ్యాప్తంగా 501 పట్టణాల్లో నిర్వహిం చనున్నట్లు 'జాతీయ పరీక్షల సంస్థ' (ఎన్టీఏ) మంగళవారం ప్రకటనలో తెలిపింది. విద్యార్థికి పరీక్ష కేంద్రం ఏ పట్టణంలో కేటాయించారనే సమాచారాన్ని తెలిపే స్లిపు జేఈఈ మెయిన్ అనే వెబ్సైట్ నుంచి డౌన్ లోడు చేసుకోవచ్చని సూచించింది. స్లిప్ డౌన్లోడ్ కాకపోతే 140759000 నంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది. పట్టణం పేరు మాత్రమే ఈ స్లిప్లో ఉంటుం దని, పరీక్ష కేంద్రం ఎక్కడనే వివరాలతో అడ్మిట్ కార్డు తరువాత జారీచేస్తామని వివరించింది.
Download Main City Intimation Slip
0 comments:
Post a Comment