రెండు దశల్లో క్రమబద్దీకరణ

 *అవసరం, లోటు, మిగులు గుర్తింపు పోస్టుల కేటాయింపుపై చర్యలు

*16లోగా ప్రక్రియ పూర్తికి ఉత్తర్వులు

 విద్యావిధానం (ఎన్ఎస్ఈపీ) 2020కి అమలులో భాగంగా ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను క్రమబద్ధీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు కూడా తరలించేందుకు అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇటీవల 117 జీవోను విడుదల చేయగా.. తాజాగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ సర్క్యులర్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల అమలులో భాగంగా విద్యాశాఖ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు, సెక్షన్ల విభజన, అవసరం, లోటు, మిగులు పోస్టులను బట్టి నియామకాలు జరపనుంది. 3.4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్న నేపథ్యంలో ఫౌండేషన్ పాఠశాలల్లో 1,2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య 30 దాటడం కష్టంగా మారుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం. 31 మంది విద్యార్ధులు ఉంటేనే రెండో ఎస్జీటీ పోస్టు ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ప్రాథమిక పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే అవకాశం ఉంది. అలాగే హెచ్ఎం, ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల కేటాయింపులోనూ నిష్పత్తిని మార్పు చేయడంతో పోస్టుల సంఖ్య తగ్గనుంది. గతంలో విద్యార్థుల సంఖ్యను బట్టి తరగతులు ఉండగా.. ఇప్పుడు తరగతుల ప్రకారం ఉపాధ్యాయులను చూపుతున్నారు.

మ్యాపింగ్, రేషనలైజేషన్ ఇలా...

మ్యాపింగ్, రేషనలైజేషన్ రెండు దశల్లో ఉంటుంది. మొదట అవసరం, లోటు, మిగులు పోస్టులను గుర్తిస్తారు. సబ్జెక్ట్ టీచర్ల కోసం ప్రాధమిక పాఠశాలల్లో 3.4.5 తరగతులు, ప్రీ-హైస్కూళ్లలోని 6,7,8 తరగతులు మ్యాప్ చేసిన ఉన్నత పాఠశాలలకు ప్రాధాన్యతనిస్తారు. 195 మంది రోల్ దాటిన ప్రీ-హైస్కూళ్లను హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ చేయడానికి, అప్గ్రేడ్ చేసిన ఈ హైస్కూళ్లకు సబ్జెక్ట్ టీచర్లను కేటాయించడానికి ప్రతిపాదనలు పంపాలి. ఎస్జీటీ, తత్సమాన కేడర్ కు వ్యతిరేకంగా డీఈవోపూల్లో పనిచేస్తున్న ఎల్ఫీలు 98 కన్నా తక్కువ రోల్ ఉన్న ఫ్రీ-హైస్కూల్కు కేటాయిస్తారు. రెండో దశలో మిగులు సబ్జెక్టు పోస్టులను గుర్తించడం, నిర్దిష్ట కేటగిరీలోని మిగులు మేరకు మరొక అవసరమైన సబ్జెక్టుకు మారడానికి సిద్ధంగా ఉన్న అర్హతగల సబ్జెక్ట్ ఉపాధ్యాయుల నుంచి సుముఖత తీసుకోవాలి. నిబంధనల ప్రకారం ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులతో సహా మిగిలిన సబ్జెక్ట్లో కూడా మార్పిడి ప్రక్రియ తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 16వ తేదీలోగా పూర్తి చేయాలి..

ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తి...

ఫౌండేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా ఉంటుంది. విద్యార్ధుల సంఖ్య 31 దాటితే 2వ ఎస్జీటీ పోస్టు ఉంటుంది. విద్యార్ధుల సంఖ్య 10లోపు ఉంటే వాటి వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సేకరించి వాటిని ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు. ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా ఉంటు ంది. ప్రధానోపాధ్యాయ (హెచ్ఎం) పోస్టు విద్యార్థుల సంఖ్య 121 దాటితేనే ఉంటుంది. ప్రీ హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 98 కన్నా తక్కువ ఉంటే 1:30 నిష్పత్తిలో 3 ఎస్జీటీ పోస్టులు ఉంటాయి. హైస్కూల్స్ (3 నుంచి 10 వరకు)లో విద్యార్థుల సంఖ్య 137 కన్నా తక్కువుంటే హెచ్ఎం, పీడీ పోస్టులు రద్దయి సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఇన్చార్జ్ హెచ్ఎంగా వ్యవహరిస్తారు. ఉన్నత పాఠశాలల్లో (6 నుంచి 10వరకు విద్యార్ధుల సంఖ్య 92కు తగ్గితే హెచ్ఎం, పీడీ పోస్టులు రద్దయి సీనియర్ స్కూల్. అసిస్టెంట్ ఇన్చార్డ్ హెచ్ఎంగా వ్యవహరిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి రెండో పీడీ ఉంటారు

సెక్షన్లు ఇలా..

3 నుంచి ఐదో తరగతి వరకు 45 లోపు విద్యార్థుల సంఖ్య ఉంటే ఒక సెక్షన్ 45- 74 ఉంటే 2, 75- 104కు 3, 105 - 134కు 4 సెక్షన్లు.. ఇలా ప్రతి 29 మంది విద్యార్థులకు ఒక సెక్షన్ పెంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. 8వ తరగతి వరకు 52 మంది విద్యార్ధులలోపు ఉంటే 1 అలాగే 6 నుంచి సెక్షన్ 53 నుంచి 87 మందికి 2, 88-122కు 3 ఇలా ప్రతి 34 మంది విద్యార్థులకు ఒక అదనపు సెక్షన్ చొప్పున 14 సెక్షన్ల వరకు సూచనలు చేసింది. 9, 10 తరగతులకు 60 మందికి ఒక సెక్షన్, 60- 99 మందికి 2, 100 నుంచి 139 మందికి 3 సెక్షన్లు.. ఇలా ప్రతి 39 మందికి అదనపు సెక్షన్ చొప్పున ఏర్పాటు చేయనుంది. అయితే ఈ రోల్ కేటాయింపు, సెక్షన్ల ఏర్పాటు ద్వారా బోధనా సిబ్బందిని సర్దుబాటు చేయాలని భావిస్తోంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top