తనిఖీల సమయంలో చూపిస్తే చాలు
త్వరలో అందుబాటులోకి..
ఈనాడు, అమరావతి: వాహనదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), కాలుష్య ధ్రువీకరణ, బీమా..తదితర పత్రాలన్నీ జేబుల్లోనో, వాహనాల్లోనో ఉంచుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు. పొరపాటున వాటిని తమ వెంట తీసుకెళ్లడం మరచిపోయినా ఆందోళన చెందాల్సిన పని ఉండదు. వాహనాల పత్రాల కోసం రవాణాశాఖ అధికారులు ఓ యాప్ సిద్ధం చేస్తున్నారు. దీనిని ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకొని అందులో వాహనం నంబరుగానీ, ఫోన్ నంబరుగానీ నమోదు చేస్తే.. ఆయా పత్రాలన్నీ కనిపిస్తాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని అదే యాప్‌లో భద్రపరచుకునే అవకాశం కూడా ఉంటుంది. తనిఖీల సమయంలో యాప్‌లో వాటిని చూపిస్తే సరిపోతుంది.
* ఆర్సీ, లైసెన్స్, వాహనాల ఇన్సూరెన్స్, కాలుష్య ధ్రువీకరణ గడువు ముగిసినా చాలామంది చూసుకోకపోవడంతో.. తనిఖీల సమయంలో వారు జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. ఇకమీదట ఆయా పత్రాల గడువు ముగిసే ముందుగా వాహనదారులను రవాణాశాఖ అప్రమత్తం చేస్తుంది.


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment