టీచర్ల ఆస్తిని ప్రకటించాలనే ఉత్తర్వులపై వెనక్కి తగ్గింది తెలంగాణ ప్రభుత్వం. విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని ద్యాశాఖ కార్యదర్శి మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు.నిలిపివేత ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని సూచించారు. అంతకుముందు విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు టీచర్లు ఫ్లాట్ కొనుగోలు చేసినా, ప్లాట్ కొనుగోలు చేసినా, ఖరీదైన ఆభరణాలు కొన్నా లెక్కలు చెప్పాలని ఆదేశిస్తూ సర్క్యూలర్ జారీ చేశారు. అయితే తాజాగా ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. టీచర్లలో గందరగోళం ఏర్పడటం.. ప్రతి పక్షాలకు ఇదో అస్త్రంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజిలెన్స్ విభాగం సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశారని, పొరపాటు జరిగిందని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment