రాష్ట్రంలో ఆగస్టు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి అందుబాటులో ఉంచినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఎంవీశేషగిరిబాబు తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో జనరల్, వొకేషనల్ ఇంటర్మీడియట్ విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షల(థియరీ)కు సం బంధించిన హాల్ టికెట్స్ ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ జ్ఞానభూమి లాగిన్లో డౌన్లోడ్ చేసుకొనే సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారులు ఈ విషయాన్ని వారి జిల్లాలలోని అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్ కి తెలియజేయాలని ఆదేశించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment