5G Network: 5జీ నెట్వర్క్ సేవలు తొలుత ప్రారంభం అయ్యేది ఈ నగరాల్లోనే.. ఇందులో మీ సిటీ ఉందేమో చెక్ చేసుకోండి..


5G Network: 5జీ నెట్వర్క్ సేవలు తొలుత ప్రారంభం అయ్యేది ఈ నగరాల్లోనే.. ఇందులో మీ సిటీ ఉందేమో చెక్ చేసుకోండి..

5G Network: దేశంలో మరో కొత్త సాంకేతిక విప్లవానికి తెరతీస్తూ 5జీ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ నెలాఖరుకల్లా 5జీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.దీంతో దేశంలో ఏ క్షణమైనా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు హల్చల్‌ చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ కొత్త ఫోన్లను లాంచ్‌ చేశాయి. యూజర్లు కూడా ఎప్పుడెప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ను యాక్సెస్‌ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో దేశంలో తొలుత ఏయే పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయన్న దానిపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. గతంలో 4జీ సేవలు కూడా మొదట్లో పలు ప్రధాన నగరాల్లో ప్రారంభమై ఆ తర్వాత చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో 5జీ నెట్‌వర్క్‌ సేవలు తొలుత అందుబాటులోకి వచ్చే నగరాల జాబితాలో.. హైదరాబాద్‌, అహ్మాదాబాద్‌, బెంగళూరు, చండీఘర్‌, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్‌, గుర్గావ్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె నగరాలు ఉన్నాయి. దేశంలో మొదట ఈ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ఇతర పట్టణాల్లో విస్తరించనున్నాయి.

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top