ఆంధ్రప్రదేశ్‌లో ప్రసుత్తం విద్యాశాఖలో ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్‌ను అన్ని శాఖల్లో అమలు చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు
సమస్యలపై పోరాడే హక్కు ఉద్యోగ సంఘాలకు ఉంద ని, గత ఉద్యమాల్లో అరెస్టయిన ఉద్యోగులకే నోటీసులు జారీ అవుతున్నాయని వివరించారు. సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే పోలీసులు ఊరుకుంటారని ప్రశ్నించారు.
సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించా రు. సీపీఎస్‌తో ఇబ్బందులుండడంతోనే కొత్త స్కీమ్ ప్రతిపాదన తీసుకొచ్చామని ఆయన వివరించారు. కొత్త స్కీమ్ సీపీఎస్ కంటే మెరుగ్గా ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వ సమస్యను ఉద్యోగులంతా అర్థం చేసుకోవాలని మంత్రి కోరారు.
కాగా ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుపై ఉద్యోగుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలంగా ముగిశాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు సమావేశమై సీపీఎస్‌పై చర్చించారు. సీపీఎస్ రద్దుకు తమకు అభ్యంతరం లేదని, దాని స్థానంలో జీపీ ఎస్ (గ్యారంటీడ్ పెన్షన్ స్కీం) ను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రులు చెప్పడంతో ఉద్యోగ సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment