బీటెక్తోపాటు లెఫ్టినెంట్ హోదా...బీటెక్ చదువుకుని, లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం

ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ చదువుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది.ఇందుకు ఉపకరించే ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రకటన విడుదలయింది. ఎంపికైనవారికి బీటెక్‌ కోర్సు, లెఫ్టినెంట్‌ కొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణ జనవరి, 2023 నుంచి ప్రారంభమవుతుంది. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసుకున్నవారికి బీటెక్‌ డిగ్రీతోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్‌ ఉద్యోగం సొంతమవుతుంది. నెలకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది.


బీటెక్తోపాటు లెఫ్టినెంట్ హోదా...బీటెక్ చదువుకుని, లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జేఈఈ మెయిన్స్‌ 2022లో సాధించిన స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో బెంగళూరులో ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. తొలిరోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటెలిజెన్స్‌) పరీక్షల్లో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని శిక్షణకు ఎంపికచేస్తారు.

శిక్షణ ఇలా

మొత్తం శిక్షణ ఐదేళ్లు కొనసాగుతుంది. ఇందులో ఏడాది పాటు ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ - గయలో బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం నాలుగేళ్లపాటు టెక్నికల్‌ ట్రైనింగ్‌ పుణె, సికింద్రాబాద్‌, మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒక చోట కొనసాగుతుంది. ఇందులో రెండు దశలు...ఫేజ్‌-1 మూడేళ్ల ప్రీ కమిషన్‌ ట్రైనింగ్‌, ఫేజ్‌-2 ఏడాది పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. మూడేళ్ల ఫేజ్‌-1 శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. నాలుగేళ్ల శిక్షణ తర్వాత లెఫ్టినెంట్‌ హోదా సొంతమవుతుంది. శిక్షణ, కోర్సు పూర్తయిన తర్వాత వీరికి ఇంజినీరింగ్‌ (బీటెక్‌) డిగ్రీని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తుంది. ఆపై వీరిని పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు.

లెవెల్‌-10 మూలవేతనం రూ.56,100తోపాటు మిలిటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 ప్రతి నెలా అందుతాయి. వీటితోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఎ, పలు ప్రోత్సాహకాలు దక్కుతాయి. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే అన్ని ప్రోత్సాహకాలూ కలిపి సీటీసీ రూపంలో నెలకు దాదాపు లక్ష రూపాయలు అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత కెప్టెన్‌, ఆరేళ్ల సర్వీస్‌తో మేజర్‌, పదమూడేళ్ల అనుభవంతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలను అందుకోవచ్చు.

ఖాళీలు: 90

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్స్‌ 2022 స్కోరు తప్పనిసరి. పురుషులు మాత్రమే అర్హులు.

వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2003 జులై 2 - 2006 జులై 1 మధ్య జన్మించినవారు అర్హులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలు. .

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/index.htm

Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top