ప్రభుత్వమే ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఇవ్వాలని కోరుతూ ఉపాధ్యాయులు లేఖ

 జగన్ (CM Jagan) ప్రభుత్వానికి (CM Jagan) ప్రభుత్వ ఉపాధ్యాయులు (Govt Teachers) షాకిచ్చారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కూడా అప్పగించింది.ఒకవైపు బోధన, మరోవైపు బోధనేతర పనులు ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారాయి. దీంతో తాము పాఠశాలలకు ఫోన్‌లు తీసుకురావడం లేదంటూ మూకుమ్మడిగా ఎంఈవో (MEO)లు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల (HM)కు లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వమే ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఇవ్వాలని కోరుతూ లేఖలో కోరుతున్నారు. డివైజ్‌ ఇవ్వడంతో పాటు డేటా కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లక్షా 93వేల హిట్‌లను తట్టుకునే సామర్ధ్యం సర్వర్‌కు లేనందున దాని సామర్ధ్యాన్ని కూడా పెంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top