ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ కొవిడ్‌ స్కాలర్‌షిప్‌

 ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ ఫౌండేషన్‌ - 'కొవిడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌'ను ప్రకటించింది. కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల కోసం దీనిని ప్రత్యేకించారు.


అర్హత: ఒకటో తరగతి నుంచి ఇంటర్‌/ పన్నెండోతరగతి/ సాధారణ డిగ్రీ/ ప్రొఫెషనల్‌ డిగ్రీల వరకు చదువుతున్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.6లక్షలకు మించకూడదు. సంస్థ ఉద్యోగుల పిల్లలు దరఖాస్తుకు అనర్హులు.


స్కాలర్‌షిప్‌: ఒకటోతరగతి నుంచి ఎనిమిదోతరగతి వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.24,000; తొమ్మిదోతరగతి నుంచి ఇంటర్‌/ పన్నెండో తరగతి వరకు చదువుతున్నవారికి ఏడాదికి రూ.30,000 ఇస్తారు. సాధారణ డిగ్రీ చదివేవారికి రూ.36,000; ప్రొఫెషనల్‌ డిగ్రీలు చేసేవారికి రూ.60,000 ఇస్తారు. తరగతి/ కోర్సును అనుసరించి సంబంధిత మొత్తాన్ని విద్యార్థి బ్యాంక్‌ అకౌంట్‌లో ఒకేసారి జమ చేస్తారు. ఈ మొత్తాన్ని విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు, భోజనం, ఇంటర్నెట్‌, స్టేషనరీ, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ఖర్చుల నిమిత్తం వినియోగించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు వారి అవసరం మేరకు లైఫ్‌ స్కిల్‌ సెషన్స్‌, కెరీర్‌ గైడెన్స్‌, కౌన్సెలింగ్‌ వంటివి నిర్వహిస్తారు.


ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి విద్యార్థుల పరిస్థితిని అంచనావేసి షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. తరవాత టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి అర్హులకు అవకాశం కల్పిస్తారు.

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 10

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: కిందటి తరగతి/ కోర్సుకు సంబంధించిన మార్కుల పత్రాలు; ఆధార్‌ కార్డ్‌/ ఓటర్‌ కార్డ్డ్‌/ డ్రైవింగ్‌ లైసెన్స్‌/ పాన్‌ కార్డ్‌; ప్రస్తుతం చదువుతున్న తరగతి/ కోర్సు ప్రవేశానికి సంబంధించిన వివరాలు; మరణించిన తల్లిదండ్రులకు సంబంధించిన హాస్పిటల్‌ రిసీట్స్‌, డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌, కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌, మెడికల్‌ బిల్స్‌, హాస్పిటల్‌ డిశ్చార్జ్‌ సమ్మరి; బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు; విద్యార్థి ఫొటో.

వెబ్‌సైట్‌: www.b4s.in/a/ABCC1

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top