ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ మండల పరిషత్ యాజమాన్యములలో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పించు విషయమై సీనియారిటీ లిస్టులను శ్రీయుత సంచాలకులు, పాఠశాల విద్య, అమరావతి వారి వెబ్ సైట్ నందు 07.10.2022న అందరికి అందుబాటులో ఉంచబడునని మరియు వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో తగిన ఆధారాలతో అప్పీలు చేయు ఉపాధ్యాయులు ట్రెజరీ కోడ్ సహాయముతో వెబ్ సైట్ నందు ది.07.10.2022 మరియు 08.10.2022 తేదీలలో మాత్రమే అప్ లోడ్ చేయువలెను మరియు ఒక్కొక్కరికి మూడు అప్పీల్స్ కు మాత్రమే అవకాశము కలదు. పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ లిస్టులపై ఎటువంటి ఫిజికల్ అప్పీల్ ను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము నందు స్వీకరించబడవని, జిల్లా విద్యాశాఖాధికారిణి, కృష్ణా, మచిలీపట్నం వారు తెలపటమైనది.
Subscribe to:
Post Comments (Atom)


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment