రేపు విడుదల కానున్న ఉపాధ్యాయుల బదిలీల జీవో


రేపు విడుదల కానున్న ఉపాధ్యాయుల బదిలీల జీవో

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు శుభవార్త ఎట్టకేలకు బదిలీల జీవో రేపు విడుదల కానున్నది. ఈరోజు విద్యాశాఖ మంత్రితో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వి. బాలసుబ్రమణ్యం, KS లక్ష్మణరావు ,షేక్ సాబ్జి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీ జీవో కి ముఖ్యమంత్రి ఆమోదం వచ్చిందని, రేపు (2th నవంబర్) సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ  GOవిడుదల చేస్తామని పిడిఎఫ్ ఎమ్మెల్సీలకు విద్యాశాఖ మంత్రి బొత్స.సత్యనారాయణ గారు వెల్లడించారు.

 మినిమం జీరో మ్యాగ్జిమం 8 సర్వీస్ గా ఉంటుందని తెలిపారు...


ది.01.11.2022 న  పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వి బాలసుబ్రమణ్యం గారు, కె ఎస్ లక్ష్మణరావు గారు, షేక్ సాబ్జి గారు, ఆంధ్రప్రదేశ్  గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారికి  ను చేసిన ప్రాతినిధ్యాలలో అంశాలు:

1) ఉపాధ్యాయుల బదిలీల జీవో సత్వరమే విడుదల చేయాలని కోరగా, మంత్రి గారు స్పందిస్తూ బదిలీల ఫైల్ పై ముఖ్యమంత్రి సంతకం చేశారని, రేపు సాయంత్రం,  బదిలీల జీవో జారీ చేస్తామని తెలిపారు.

2) ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ప్రమోషన్లు సత్వరమే ఇవ్వాలని ప్రాతినిధ్యం చేయగా, సంఘాల అంగీకారం మేరకు త్వరలో ప్రమోషన్లతో భర్తీ చేస్తామని, ఆ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

3) నూతనంగా మంజూరు చేసిన  679 ఎం.ఈ.వో పోస్టుల ని న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి భర్తీచేయాలని ప్రాతినిధ్యం చేశారు.

4) మున్సిపల్ ఉపాధ్యాయుల జీతాల డ్రాయింగ్ పవర్స్ సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఇవ్వడానికి సంబంధించిన ఉత్తర్వుల ఫైలును ఆర్థిక శాఖలో ఆమోదం పొందేలా సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరగా, సత్వరం ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

5) కొయ్యలగూడెం మండలం నందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరగా, మంజూరు చేయుటకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

6)డీఎస్సీ-2008 లో నష్టపోయిన అభ్యర్థులు అందరికీ గౌరవ కోర్టు తీర్పును అనుసరించి శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగాలు ఇవ్వాలని ప్రాతినిధ్యం చేయగా,కోర్టు తీర్పు ప్రకారం అర్హులందరికీ  శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల ఇచ్చుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు

7) డీఎస్సీ-1998 ఉపాధ్యాయ ఉద్యోగ  నియామకాలను సత్వరమే చేపట్టి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా   సింగిల్ టీచర్ పాఠశాలల్లో నియమించాలని కోరగా, బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు.

8) ఐటీడీఏ రామచంద్రాపురం పరిధిలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ డైట్ కళాశాలలో టీచింగ్ మరియు  నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేయవలసిందిగా కోరగా, మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

9) ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ నందు గల మాకా ఉరుదూ ఉన్నత పాఠశాలలో ఉర్దూ లాంగ్వేజ్ పండిట్ గ్రేడ్-1 పోస్ట్ ను మంజూరు చెయ్యాలని మరియు ఉరుదూ ఉన్నత పాఠశాలలలో ఉర్దూ మాద్యమం కలిగిన ఉపాధ్యాయుల్ని ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని ప్రాతినిధ్యం చేశారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top