Post Office Jobs: పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు, ఖాళీల వివరాలివే! Post Office Jobs: పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు, ఖాళీల వివరాలివే!

Post Office Jobs: దేశంలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్టు తెరలెపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 98,083 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రీజియన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్లనున్నట్లు ప్రకటించింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.  మొత్తం ఉద్యోగాల్లో పోస్ట్‌మ్యాన్-59,099 పోస్టులు; మెయిల్ గార్డు-1445 పోస్టులు; మల్టీటాస్కింగ్ స్టాఫ్-37,539 పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్, ఇతర ఉద్యోగాల భర్తీకి పదోతరగతి అర్హత ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు వయసు 18-32 మధ్య ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరులో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. డిసెంబరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

ఇక తెలుగు రాష్ట్రాల పరిధిలో చూస్తే.. 3565 పోస్టులు ఉన్నాయి. వీటిలో పోస్ట్‌మ్యాన్-2289 పోస్టులు; మెయిల్ గార్డు-108 పోస్టులు; మల్టీటాస్కింగ్ స్టాఫ్-1166 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ పరిధిలో 2513 ఖాళీలు ఉన్నాయి. వీటిలో పోస్ట్‌మ్యాన్-1553 పోస్టులు; మెయిల్ గార్డు-82 పోస్టులు; మల్టీటాస్కింగ్ స్టాఫ్-878 పోస్టులు ఉన్నాయి. 

వివరాలు...

* పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు

ఖాళీల సంఖ్య: 98,083 

1) పోస్ట్‌మ్యాన్: 59,099 పోస్టులు

2) మెయిల్ గార్డు: 1445 పోస్టులు

3) మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 37,539 

అర్హతలు: పోస్ట్‌మ్యాన్ పోస్టులకు ఇంటర్, మెయిల్ గార్డు పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి, ఎంటీఎస్ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 - 32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

Website

రీజియన్లవారీగా ఖాళీల వివరాలు ఇలా.



0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top