పదవ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 265 ఖాళీలు వివరాలు ఇవే

టాటా మెమోరియల్ సెంటర్ అనేది క్యాన్సర్ రోగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం గానీ, క్యాన్సర్ ని నివారణ చర్యలు చేపట్టడం, ఆంకాలజీ మరియు అనుబంధ విభాగాల్లో.. క్యాన్సర్ రీసెర్చ్ మరియు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పనులు చేయడంలో అత్యంత శ్రద్ధ తీసుకునే లక్ష్యంతో సమగ్రంగా పని చేస్తున్న క్యాన్సర్ సెంటర్. టీఎంసీ అనేది భారత ప్రభుత్వానికి చెందిన అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ చేత నడపబడుతున్న సంస్థ. ఈ సంస్థలోని పలు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ముంబై, వైజాగ్ సహా పలు నగరాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ, పురుషులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చునని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మరి పోస్టులు ఏంటి? కావలసిన అర్హతలు ఏమిటి? జీతం ఎంత? జబ లొకేషన్ ఎక్కడ? అనే వివరాలు మీ కోసం.        

మొత్తం ఖాళీలు: 265

లోయర్ డివిజన్ క్లర్క్ ఖాళీలు: 18

అటెండెంట్ ఖాళీలు: 10

ట్రేడ్ హెల్పర్ ఖాళీలు: 35

నర్స్ ‘ఏ’ ఖాళీలు: 122

నర్స్ ‘బి’ ఖాళీలు: 30

నర్స్ ‘సి’ ఖాళీలు: 50

లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టు వివరాలు:

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో కనీసం 3 నెలల వ్యవధి కలిగిన ఎంఎస్-సీఐటీ లేదా కంప్యూటర్ కోర్స్ చేసి ఉండాలి. 

డిప్లోమా లేదా కంప్యూటర్ లో గానీ ఐటీలో గానీ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వీరు కంప్యూటర్ కోర్స్ చేయకపోయినా పర్లేదు. 

అనుభవం: కనీసం ఏడాది పాటు క్లెరికల్ పనిలో అనుభవం ఉండాలి. 

వయసు పరిమితి: 10/01/2023 నాటికి గరిష్ట వయసు 27 ఏళ్ళు ఉండాలి. 

జాబ్ లొకేషన్: టాటా మెమోరియల్ హాస్పిటల్, పరేల్, ముంబై

జీతం: రూ. 19,900/- + అలవెన్సులు 

నర్స్ ‘ఏ’ పోస్టు వివరాలు:

అర్హత: జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ+ ఆంకాలజీ నర్సింగ్ లో డిప్లోమా చేసి ఉండాలి. అలానే 50 పడకల ఆసుపత్రిలో ఏడాది పాటు క్లినికల్ అనుభవం ఉండాలి. 

లేదా బేసిక్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసి.. 50 పడకల ఆసుపత్రిలో ఏడాది పాటు క్లినికల్ అనుభవం కలిగి ఉండాలి. పోస్ట్ బేసిక్ బీఎస్సీకి ముందు క్లినికల్ అనుభవం ఉన్నా అర్హులుగా పరిగణిస్తారు.

టాటా మెమోరియల్ సెంటర్ లో నర్సింగ్ ఆంకాలజీలో డిప్లోమా చేసి.. మొత్తం బాండ్ వ్యవధిలో పనిచేసిన వారికి 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.

అభ్యర్థులు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

హెపటైటిస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసి ఉండాలి. 

జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ & బేసిక్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) పూర్తి చేసిన వారు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

వయసు పరిమితి: 10/01/2023 నాటికి గరిష్టంగా 30 ఏళ్ళు ఉండాలి. 

జాబ్ లొకేషన్స్: ముంబైలోని పారెల్ లో ఉన్న టాటా మెమోరియల్ హాస్పిటల్, ఉత్తరప్రదేశ్ లో ఉన్న మహాత్మా పండిట్ మదన్ మోహన్ మాళవియా క్యాన్సర్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్

ముజాఫ్ఫార్పూర్ లో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్

జీతం: రూ. 44,900/- + అలవెన్సులు

నర్స్ ‘బి’ పోస్టు వివరాలు:

అర్హత: జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ+ ఆంకాలజీ నర్సింగ్ లో డిప్లోమా చేసి ఉండాలి. అలానే 100 పడకల ఆసుపత్రిలో ఆరేళ్ళ పాటు క్లినికల్ అనుభవం కలిగి ఉండాలి. 

లేదా బేసిక్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసి.. 100 పడకల ఆసుపత్రిలో ఆరేళ్ళ పాటు క్లినికల్ అనుభవం కలిగి ఉండాలి. పోస్ట్ బేసిక్ బీఎస్సీకి ముందు క్లినికల్ అనుభవం ఉన్నా అర్హులుగా పరిగణిస్తారు.

అడ్మినిస్ట్రేటివ్ అనుభవం/హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్/ఆంకాలజీ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.  

టాటా మెమోరియల్ సెంటర్ లో నర్సింగ్ ఆంకాలజీలో డిప్లోమా చేసి.. మొత్తం బాండ్ వ్యవధిలో పనిచేసిన వారికి 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.

అభ్యర్థులు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

హెపటైటిస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసి ఉండాలి. 

జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ & బేసిక్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) పూర్తి చేసిన వారు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

వయసు పరిమితి: 10/01/2023 నాటికి గరిష్టంగా 35 ఏళ్ళు ఉండాలి. 

జాబ్ లొకేషన్స్: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న మహాత్మా పండిట్ మదన్ మోహన్ మాళవియా క్యాన్సర్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, ముజాఫ్ఫార్పూర్ లో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ 

జీతం: రూ. 47,600/- + అలవెన్సులు

నర్స్ ‘సి’ పోస్టు వివరాలు:

అర్హత: జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ+ ఆంకాలజీ నర్సింగ్ లో డిప్లోమా చేసి ఉండాలి. అలానే 100 పడకల ఆసుపత్రిలో 12 ఏళ్ల పాటు క్లినికల్ అనుభవం కలిగి ఉండాలి. 

లేదా బేసిక్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసి.. 100 పడకల ఆసుపత్రిలో 12 ఏళ్ల పాటు క్లినికల్ అనుభవం కలిగి ఉండాలి. పోస్ట్ బేసిక్ బీఎస్సీకి ముందు క్లినికల్ అనుభవం ఉన్నా అర్హులుగా పరిగణిస్తారు.

అడ్మినిస్ట్రేటివ్ అనుభవం/హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్/ఆంకాలజీ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.  

టాటా మెమోరియల్ సెంటర్ లో నర్సింగ్ ఆంకాలజీలో డిప్లోమా చేసి.. మొత్తం బాండ్ వ్యవధిలో పనిచేసిన వారికి 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.

అభ్యర్థులు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

హెపటైటిస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసి ఉండాలి. 

జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ & బేసిక్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) పూర్తి చేసిన వారు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. 

వయసు పరిమితి: 10/01/2023 నాటికి గరిష్టంగా 40 ఏళ్ళు ఉండాలి. 

జాబ్ లొకేషన్స్: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న మహాత్మా పండిట్ మదన్ మోహన్ మాళవియా క్యాన్సర్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, ముజాఫ్ఫార్పూర్ లో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్, ఏపీలోని వైజాగ్ లో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్

జీతం: రూ. 53,100/- + అలవెన్సులు

అటెండెంట్ పోస్టు వివరాలు:

అర్హత: పదవ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

అనుభవం:ఫైలింగ్, రికార్డ్ కీపింగ్, డిస్పాచ్ వర్క్, ఆపరేటింగ్ ఫోటో కాపీ మెషిన్, హెల్పింగ్ ఇన్ ఆఫీస్ వర్క్, డస్టింగ్ మరియు క్లీనింగ్ వంటి పనుల్లో ఖచ్చితంగా కనీసం ఒక ఏడాది పాటు అనుభవం ఉండాలి. 

వయసు పరిమితి: 10/01/2023 నాటికి గరిష్టంగా 25 ఏళ్ళు ఉండాలి. 

జాబ్ లొకేషన్: ఏపీలోని వైజాగ్ మరియు పంజాబ్ లోని ముల్లన్పూర్ లో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్

జీతం: రూ. 18,000/- + అలవెన్సులు

ట్రేడ్ హెల్పర్ పోస్టు వివరాలు:

అర్హత: పదవ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

అనుభవం: మెయింటనెన్స్, ఆపరేషన్ థియేటర్/ఐసీయూ/డయాగ్నోస్టిక్స్ సర్వీసెస్/ల్యాబరేటరీ/ఇంజనీరింగ్ విభాగాల్లో ఎక్విప్మెంట్స్ క్లీనింగ్, నిర్వహణ, ఆఫీస్ వర్క్ లో కనీసం ఏడాది పాటు అనుభవం ఉండాలి.   

వయసు పరిమితి: 10/01/2023 నాటికి గరిష్టంగా 25 ఏళ్ళు ఉండాలి. 

జాబ్ లొకేషన్: ఏపీలోని వైజాగ్ మరియు పంజాబ్ లోని ముల్లన్పూర్ లో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్

జీతం: రూ. 18,000/- + అలవెన్సులు

ఎంపిక విధానం:

రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: 

ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్ మేన్ లకు: రూ .0/-

ఇతరులకు: రూ. 300/-

దరఖాస్తు చివరి తేదీ: 10/01/2023

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:

ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:

Online Application

Complete  Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top