BF.7: చైనాలో కరోనా కొత్త వేరియంట్‌.. భారత్‌లోనూ మూడుకేసులు..

తొలిసారి వెలుగు చూసిన చైనాలో మహమ్మారి మరోసారి ఉగ్రరూపం చూపిస్తోంది. అయితే, ఈసారి అక్కడ వైరస్‌ విజృంభణకు ఒమిక్రాన్ (Omicron) ఉపరకమైన బిఎఫ్7 (BF.7) కారణమని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఆ వేరియంట్ భారత్‌కూ వ్యాపించింది. తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ నెలలోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 3 నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా మరో కేసు ఒడిశాలో వెలుగు చూసినట్లు తెలిపాయి.

భారత్‌లో కొత్త వేరియంట్‌ (BF.7) వెలుగు చూసినప్పటికీ మొత్తం కేసుల్లో పెరుగుదల గణనీయంగా లేదని కొవిడ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నిపుణులు వెల్లడించారు. అయినప్పటికీ.. వ్యాప్తిలో ఉన్న వాటితోపాటు కొత్తగా బయటపడుతోన్న వేరియంట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలోనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ (Genome Sequencing)పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించినట్లు సమాచారం.

చైనాలో విస్తృత వ్యాప్తి..

అధికారిక వర్గాల ప్రకారం.. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌(Omicron), దాని ఉపరకాల విజృంభణ కొనసాగుతోంది. బీజింగ్‌ వంటి నగరాల్లో బీఎఫ్‌.7 వేరియంట్‌ ప్రధానంగా వ్యాప్తిలో ఉంది. ఈ వేరియంట్‌ కారణంగానే చైనా వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదివరకు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకపోవడం, వ్యాక్సిన్‌ సమర్థత కారణంగా అక్కడి ప్రజలు తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండటం వంటివి చైనాలో వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందడానికి కారణంగా తెలుస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు  తెలిపాయి. 

ఏమిటీ బీఎఫ్‌.7 వేరియంట్‌..?

ఒమిక్రాన్‌ వేరియంట్‌ (Omicron) బీఏ.5కు చెందిన ఉపరకమే బీఎఫ్‌.7. విస్తృత వేగంతో వ్యాప్తి చెందే ఈ వేరియంట్‌కు బలమైన ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం కూడా ఉంది. దీని ఇంక్యుబేషన్‌ వ్యవధి కూడా చాలా తక్కువ. అంతేకాకుండా రీఇన్‌ఫెక్షన్‌ (Reinfection) లేదా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికీ ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉంది. చైనాలోనే కాకుండా అమెరికా, బ్రిటన్‌తోపాటు బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ వంటి ఐరోపా దేశాల్లోనూ ఈ వేరియంట్‌ ఇప్పటికే వెలుగు చూసింది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top