Job Mela: ఏపీలో ఎల్లుండి భారీ జాబ్ మేళా.. KIA, Amara Rajaతో పాటు 13 సంస్థల్లో 900పైగా ఖాళీలు

ఆధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంగా మారింది. ఈ నెల 23న మరో భారీ జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (APSSDC Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాను ఏలూరు జిల్లాలో నిర్వహించనున్నారు. ఈ జామ్ మేళాలో ప్రముఖ అమర్ రాజా, కియా, హెటిరో, అపోలో ఫార్మసీ, మాక్స్ సెక్యూరిటీ సర్వీసెస్ తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. హెటిరో డ్రగ్స్:ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, ఎంఎస్సీ (కెమిస్ట్రీ) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

KIA Motors:ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనం ఉంటుంది. రూ.2 వేల అటెండెన్స్ బోనస్ సైతం చెల్లించనున్నారు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.Amara Raja Group:ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రూ.12 వేల వేతనంతో పాటు ఫుడ్, ఇతర వసతి సదుపాయం ఉంటుంది. చిత్తూరులో పని చేయాల్సి ఉంటుంది.

Apollo Pharmacy:ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ/ఎం/డీ ఫార్మసీ అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది.Max Security Services:ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ గార్డ్స్, సెక్యూరిటీ సూపర్ వైజర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. రూ.11 వేల నుంచి రూ.16 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు ఏలూరు , కొవ్వూరు, రాజమండ్రిలో పని చేయాల్సి ఉంటుంది.




ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 23న ఉదయం 9 గంటలకు ZP High School, Buttayagudem, Eluruలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- ఇతర వివరాలకు 9182342688, 8639980807 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top