Ayushman Bharat Yojana: దేశంలోని పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికింద ఇప్పటి వరకు దేశంలో కోట్లాది మంది లబ్ధిదారులుగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..2018 నుంచి..
దేశంలోని అత్పాదాయ వర్గాలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించటంలో భాగంగా.. ఉచిత చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ఇందులో చేరి ఇప్పటికే లబ్ధి పొందుతున్నారు. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందజేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018లో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు 4.5 కోట్ల మంది ఇందులో చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఇటీవల పార్లమెంటులో వెల్లడించారు.
మూడు నెలల్లో కోటి మంది..
ఆయుష్మాన్ భారత్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య రక్షణ పథకంగా అవతరించిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంట్‌లో తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా దేశంలోని 4.5 కోట్ల మంది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండానే లబ్ధి పొందారని వెల్లడించారు. సెప్టెంబర్ మాసంలో స్కీమ్ లబ్ధిదారుల సంఖ్య 3.8 కోట్లుగా ఉంది. అయితే గడచిన మూడు నెలల్లో దాదాపు కోటి మంది దీనికింద నమోదు కావటం రికార్డు అని చెప్పుకోవాలి. రానున్న రోజుల్లో అన్ని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు.ప్రభుత్వం గోల్డెన్ కార్డు..
ఈ స్కీమ్ కోసం ఎవరైనా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆయుష్మాన్ అనేది భారత ప్రభుత్వ ఆరోగ్య పథకం, దీని కింద ప్రభుత్వం ప్రజలకు ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్‌ని అందిస్తుంది. ఈ కార్డును వినియోగించి ఆర్థికంగా బలహీన వర్గాల వారు ఆసుపత్రులకు వెళ్లి ఉచితంగా చికిత్స పొందవచ్చు.
దరఖాస్తు అర్హతలు..
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎవరైనా వ్యక్తి స్వయంగా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే అతని పేరు SECC- 2011లో ఉండాలి. SECC అంటే సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్. అసలు ఎవరైనా వ్యక్తి ఈ పథకాన్ని పొందేందుకు అర్హులా కారా అనే దానిని తనిఖీ చేసుకునేందుకు ముందుగా mera.pmjay.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ..
* దరఖాస్తు కోసం ముందుగా mera.pmjay.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి
* తర్వాత స్క్రీన్‌పై మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి
* వివరాలు అందించగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది దానిని నమోదు చేయాలి
* ఓటీపీ వివరాలు అందించగానే స్క్రీన్‌పై కొత్త పేజీ తెరవబడుతుంది.
* అక్కడ మీరు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రాన్ని ఎంచుకోవాలి
* ఆపై మీ అర్హతను తనిఖీ చేయడానికి మొబైల్ నంబర్, పేరు, రేషన్ కార్డ్ నంబర్ లేదా RSBY URN నంబర్‌ను నమోదు చేయాలి
* వివరాలు పూరించిన తర్వాత పేజీ కుడి వైపున మీ పేరు కనిపిస్తే.. మీరు అర్హులని అర్థం
* ఆ తర్వాత మీరు 'ఫ్యామిలీ మెంబర్' ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా లబ్ధిదారుల వివరాలను కూడా తనిఖీ చేయవచ్చు
* ఇది కాకుండా మీరు సమీపంలోని పబ్లిక్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా మీ అర్హతను తనిఖీ చేయవచ్చు
వివిధ రకాల ఉద్యోగ సమాచారం కావాల్సిన వారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి
https://chat.whatsapp.com/KzhsyPBz4P7LiGxNUaxyj5
0 comments:
Post a Comment