Green tea: హై బీపీకి గ్రీన్ టీతో చెక్! రోజూ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

హైపర్ టెన్షన్.. బయటకు కనిపించకుండా శరీరాన్ని గుల్లచేసేస్తుంది.దీనిని అదుపులో ఉంచుకోకపోతే కిడ్నీలు, గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రధానంగా ఇది జీవన శైలి ద్వారానే సంక్రమించే వ్యాధి. ఈ వ్యాధి ఉందని తెలిసిన వెంటనే జీవన శైలిలో మార్పులు చేసుకొని, డైట్ కూడా కఠినంగా ఫాలో అయితే పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ డైట్ లో ఏది తీసుకోవాలి.. ఏది తీసుకోకూడదు అన్న మీమాంస అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా పానీయాల విషయంలో. ఇక టీ, కాఫీల విషయంలోనైతే మరీను. ఈ నేపథ్యంలో హైపర్ టెన్షన్తో బాధపడే వారు టీ, కాఫీలు తాగొచ్చా? దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారు చూద్దాం..220 మిలియన్ల మంది బాధితులు..

డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు 220 మిలియన్ల మంది ఈ బీపీ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. దీనిని అలా వదిలేస్తే ప్రాణానికే ప్రమాదం. ఈ నేపథ్యంలో మన ప్రతి రోజూ డైట్ లో కొన్ని మార్పులు అవసరం. పానీయాల విషయంలో కూడా. చాలా మంది టీ, కాఫీ, లేదా గ్రీన్ టీ తీసుకుంటారు. వీటిలో ఏది మంచిది? ఏది తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుంది? ఓ సారి చూద్దాం..

స్టడీ ప్రకారం..

జీఏసీసీ(జపాన్ కోలాబోరేటివ్ కోహర్ట్ స్టడీ ఫర్ ఇవాల్యూయేషన్ ఆఫ్ క్యాన్సర్ రిస్క్) కాఫీ, గ్రీన్ టీలలో ఏది తాగితే మంచిది అనే అంశంపై ఓ పరిశోధన చేసింది. దాని ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్(జేఏహెచ్ఏ) జర్నల్లో ప్రచురించింది. దాదాపు 18 వేల మందిపై ఈ పరిశోధనను దాదాపు 12 ఏళ్ల పాటు నిర్వహించారు. ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రోజూ కాఫీ, గ్రీన్ టీ తాగడం ద్వారా వారి బ్లడ్ ప్రెజర్, గుండె ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేదాన్ని అంచనా వేశారు.గ్రీన్ టీ ఉత్తమం..

ఓ కప్పు కాఫీలో 95 నుంచి 200 ఎంజీల కెఫిన్ ఉంటుందని, అయితే అదే పరిమాణంలో ని గ్రీన్ టీ లో 35 గ్రాముల కెఫిన్ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అంటే ఒక కప్పు కాఫీలో మూడు రెట్లు ఎక్కవ కెఫిన్ ఉంటుంది. దీని ద్వారా కాఫీ కన్నా గ్రీన్ టీ బీపీకి, గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని కొనుగొన్నారు. అధిక రక్తపోటు ఉన్న వారు కాఫీ వినియోగం హాని చేస్తుంది. దాని స్థానంలో గ్రీన్ టీ తీసుకుంటే మంచిది.

గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు..

కేవలం బీపీ గురించే కాకపోయినా.. గ్రీన్ టీలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు చూద్దాం..రోగనిరోధక శక్తికి బూస్ట్.. గ్రీన్ టీ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూ, దగ్గు నుంచి సంరక్షిస్తాయి. అందువల్ల, మీకు గొంతు నొప్పి వచ్చినప్పుడల్లా ఈ మిశ్రమాన్ని తాగొచ్చు.


మెదడు ఆరోగ్యానికి.. గ్రీన్ టీలోని కాటెచిన్ సమ్మేళనాలు నరాల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది మెదడుకు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించడం లేదా రివర్స్ చేయడంలో కూడా సహాయపడవచ్చు.

వెయిట్ లాస్.. గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీవక్రియను మెరుగు పరచడంతో పాటు అనవసర కొవ్వులను అదుపు చేయడంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

నోటి దుర్వాసనకు చెక్.. చాలా మందికి తెలియని విషయం ఇది. గ్రీన్ టీ నోటి ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలను అణిచివేసి దుర్వాసను దూరం చేస్తుంది.

వివిధ రకాల ఉద్యోగ సమాచారం కావాల్సిన వారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి

https://chat.whatsapp.com/KzhsyPBz4P7LiGxNUaxyj5


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top