Yantra India Recruitment 2023 : భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీఐ, నాన్ ఐటీఐ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 5,395 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాళీలను విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. వివరాల్లోకెళ్తే.
మొత్తం ఖాళీలు : 5,395
ఐటీఐకు సంబంధించి- 3508 ఖాళీలు
నాన్ ఐటీఐకు సంబంధించి- 1887 ఖాళీలు
ట్రేడులు: మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం; నాన్-ఐటీఐ కేటగిరీకికి సంబంధించి అభ్యర్థులు 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28.03.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000; ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.100) గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 27, 2023.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మార్చి 28, 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.yantraindia.co.in/career.php
Download Complete Notification


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment