వై. ఎస్. ఆర్ జిల్లా (ఉమ్మడి) సహాయకులందరికి కడప యందు పనిచేయుచున్న పాఠశాల తెలయచేయడమేమనగా కమిషనర్ పాఠశాల విద్య, అమరావతి వారి ఉత్తర్వుల మేరకు వై. ఎస్. ఆర్. జిల్లా (ఉమ్మడి) కడప యందు ఇటీవల హై స్కూల్ ప్లస్ పాఠశాలలో మంజూరైన 92 పిజిటి పోస్టుల యందు పిజిటి సబ్జెక్ట్స్ ' బోధించుటకు గాను అర్హత మరియు ఆసక్తి గల పాఠశాల సహాయకుల నుండి దరఖాస్తులు కోరడమైనది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు www.kadapadeo.in మరియు దరఖాస్తు ఫారమును వెబ్సైటు నందు పొందుపరచదమైనది.
కావున అర్హత మరియు ఆసక్తి గల పాఠశాల సహాయకులు హై స్కూల్ ప్లస్ పాఠశాల లో పిజిటి సబ్జెక్ట్స్ బోధించుటకు గాను నిర్ణీత ప్రొఫార్మ యందు వారి అర్హత వివరాలు నింపి జిరాక్స్ అర్హత ధ్రువపత్రాలు జతచేసి రేపు 09-05-2023 ఉదయం 10.00 గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, వై. ఎస్. ఆర్ జిల్లా యందు అందజేయవలసినదిగా కోరడమైనది.


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment