ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి గారితో జరిగిన చర్చల సారాంశం

కొన్ని అంశాల మీద విద్యాశాఖ మంత్రి గారు, విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారిని ,,జెడి సర్వీసెస్ ఎం రామలింగం గారిని కలిసాము. ఈ సందర్భంగా వివిధ అంశాలు ప్రస్తావించాం.



** గత ప్రమోషన్ లో  రిలింక్విష్ చేసిన   ఉపాధ్యాయులకు అర్హత కలిగిన మరొక సబ్జెక్టుల్లో ప్రమోషన్లకి అవకాశం కల్పించాలని కోరాము. దీన్ని  పరిశీలిస్తామని తెలిపారు

** గత ప్రమోషన్ ఇచ్చి పది రోజులు మాత్రమే అయిందని మళ్లీ ఇప్పుడు ప్రమోషన్స్ ఇస్తున్నారని ,సీనియర్స్ ఇబ్బంది లేకుండా తగు పరిశీలన చేయాలని  చెప్పాము. సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని తెలియజేశారు..

** PS HM లు, కొద్ది మంది స్కూల్ అసిస్టెంట్స్ కన్వర్షన్  కోరుతున్నారని వీరికి కన్వర్షన్ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరాము. వారి సంఖ్యను బట్టి ఆ జిల్లాలో ఉన్న నీడ్ కు అనుగుణంగా  ప్రయత్నం చేస్తారు.

** బదిలీలు   కోరుకొని రిలీవర్  రాక రిలీవ్ కానీ ఉపాధ్యాయులని వెంటనే రిలీవ్ చేయాలని కోరాము.. రెండు రోజుల్లో ప్రమోషన్ ఇస్తున్నాం కనుక కొత్తవారు కోరుకున్న తర్వాత వీలైనంతవరకు రిలీవ్ చేస్తామని తెలియజేశారు..

** బదిలీల వల్ల క్యాడర్ స్ట్రెంట్ లో   వచ్చిన ఇబ్బందుల వల్ల ఇప్పటికీ జీతాలు రాని ఉపాధ్యాయులకు క్యాడర్ అప్డేట్ చేసి వెంటనే వారికి జీతాలు ఇప్పించే లాగున చర్యలు తీసుకోవాలని చెప్పాము. ఈ నెలలో మొత్తం క్యాడర్ స్ట్రేంత్ ని  అప్డేట్ చేస్తామని తెలియజేశారు.

** ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులను గతంలో రేష్నలైజేషన్ చేశారని ఇప్పుడు ప్రతి ఉన్నత పాఠశాలలో కచ్చితంగా ప్రధానోపాధ్యాయులను నియమించాలని కోరాము.

రోల్  పెరిగిన పాఠశాలలో ఆ మేరకు నియామకాలు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

** 98 లోపు విద్యార్థులు సంఖ్య ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో ముగ్గురు సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమిస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఈ బదిలీల్లో ఆయా పాఠశాలలో SGT లు కోరుకొని ఉన్నారు.. కనుక వారిని ఆ మండలంలోని బ్లాక్ చేసిన పోస్టులోకి బదిలీ చేయవలసిందిగా కోరాము. తప్పక పరిశీలించి వారికి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలియజేశారు.

** అర్హత కలిగిన పీఈటీలు రెండు సంవత్సరాలు పూర్తి అయ్యారని ,వారికి పీడీలుగా ప్రమోషన్ ఇచ్చే దానికోసం షెడ్యూల్ ప్రకటించాలని కోరాము. 

** బదిలీల గ్రీవెన్స్ లో కొన్ని జిల్లాల్లో ఇంకా పరిష్కారం చేయలేదని ,పరిష్కారానికి వెంటనే సంబంధిత ఆర్జెడీలతో మాట్లాడవలసిందిగా తెలియజేశాము .ఆ ,యా జిల్లాల RJD గారితో మాట్లాడి జెన్యూన్ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు.

** డి వై ఈ ఓ,  ఎంఈఓ 1, ఎంఈఓ2 పోస్టులను కామన్ సర్వీస్ రూల్స్ ఆధారంగా మాత్రమే భర్తీ చేయాలని ,.అలాగే సీనియర్ MEO కి మాత్రమే DDO పవర్ ఇవ్వాలని,స్పష్టం చేసాము.

** అర్బన్ ఎంఈఓ పోస్టులు సుమారు 66 ఉన్నాయని ఈ పోస్టులన్నింటినీ మున్సిపల్ ప్రధానోపాధ్యాయులు చేత మాత్రమే భర్తీ చేయాలని కోరాము. సర్వీస్ రూల్స్ ఫైల్ GAD వద్ద వున్నదని, అది రాగానే బదిలీలు,ప్రమోషన్స్ MEO పోస్ట్ లు ఇస్తామని తెలిపారు.

మున్సిపల్ ఏరియాలో అవసరమైన మేరకు నూతన పాఠశాలలను స్థాపించడానికి కృషి చేయాలని తెలిపాము ఎక్కడ పాఠశాలలు అవసరమొ గుర్తించి స్థలం దొరికితే తప్పక కొత్త పాఠశాలలు స్థాపనకు ప్రయత్నం చేస్తామని తెలిపారు.

**ట్రైబల్ ఏరియా లో MEO పోస్టులు అర్హత కలిగిన ట్రైబల్ ఉపాద్యాయుల చేత భర్తీకి అవకాశం ఇవ్వాలని చెప్పాము. పరిశీలిస్తామని తెలిపారు.

**GO 117 వల్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని,దీనిని పరిశీలించాలని కోరాము.

**అకడమిక్ విషయాలపై స్పష్టత లేకపోవడం వల్ల రెగ్యులర్ పాఠశాల పనిలో చాలా ఇబ్బందులు వస్తున్నాయని, వీటిపై ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరాము.వారం లో అకడమిక్ అంశాలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు.

** 2008 MTS ఉపాద్యాయులను రెగ్యులర్ చేయాలని, 1998 DSC లో అర్హత కలిగిన వారికి పోస్టింగ్ లు ఇవ్వాలని కోరాము...సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపారు.

**ఉపాధ్యాయులకు వివిధ బకాయిలు ఇంకా చెల్లించాలని,ప్రత్యేకించి సరెండర్ లివ్ క్యాష్ కాలేదనే విషయాన్ని దృష్టికి తెచ్చాము.బకాయిలు త్వరలో చెల్లిస్తామని తెలిపారు.

** గత రెండు సంవత్సరాల నుండి స్కూల్ గ్రాండ్స్ రావడం లేదని, దీనివల్ల చేతి డబ్బులు ఉపాధ్యాయులు ఖర్చు పెట్టాల్సి వస్తుందనే విషయాన్ని అధికారుల దృష్టిలో పెట్టాము. కరెంటు బిల్లులు ఎవరు చెల్లించవద్దని ,గ్రాంట్ సమగ్ర శిక్ష వారితో మాట్లాడి వెంటనే చెల్లించడానికి తగ్గు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు...


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top