Promotion Pay Fixation పదోన్నతి వేతన స్థిరీకరణపై వివరణ ( FR22B లేక FR22a(i) )

గౌరవనీయులైన మండల విద్యాశాఖాధికారులు / జడ్.పి.స్కూలు ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా పదోన్నతి పొందిన ఉపాధాయులు ఏ విధంగా లాభదాయకమైన ఆప్షన్తో ఫిక్సేషన్ కొరకు ఏ ఉపాధ్యాయలు ఇవ్వాలి మరియు ఏ ఉపాధాయునికి ఆప్షన్తో అవసరము లేకుండా ఫిక్సేషన్ చేయాలో & బిల్ ఏవిధంగా క్రమముగా సబ్మిట్ చేయాలో అనేక సందేహాలు ఉంటాయి. దీనిపై కొంచెమైన అవగాహాన అందరూ పొందుటకుగాను క్రింద విధంగా క్లుప్తంగా తెలియపరచుచున్నాము. 

పదోన్నతి వేతన స్థిరీకరణ జి.ఓ.నెం:96 ఫైనాన్స్ తేది: 20-5-2011 రూలు 7(viii) ప్రకారం జరుగును

ఎ)పదోన్నతికి ముందు ఫీడరు కేడర్ నందు 24 సం॥ల స్కేలు పొందియున్నచో వీరు ఆసలు ఆప్షన్ ఇచ్చేఅవకాశం లేదు.వీరికి పదోన్నతి తేదికి ఒక ఇంక్రిమెంట్ FR22a(i) ప్రకారంగా వేతన స్థిరీకరణ చేయబడును.మరలా ఫీడరు కేడరు లోని రెగ్యులర్ ఇంక్రిమెంటు FR 31(2) ప్రకారంగా కొనసాగును. వీరికి పదోన్నత కేడరులో 6/12/18/24/30 సం॥ముల స్కేలు పొందుటకు ఎటువంటి అర్హత లేదని గమనించాలి.

బి) పదోన్నతికి ముందు ఫీడరు కేడర్ నందు 24 సం॥ల స్కేలు పొందకుంటే వీరు లాభదాయకంటే క్రింద తెలుప పడిన రెండు ఆప్షన్లో ఒక దానిని నిర్ణీత ఆప్షన్ ఫారము నందు నమోదు పరచి డిడిఓ గారికి సమర్పించాలి. 

1) పదోన్నతి తేదికి ఆప్షన్ ఇచ్చే అవకాశము. ఆ తేదికే రెండు ఇంక్రిమెంట్లు తో ఫిక్సేషన్ చేయబడును. వీరికి తదుపరి ఇంక్రిమెంటు 12 నెలల తర్వాతనే వస్తుంది. కావున వీరి ఇంక్రిమెంట్ నెల మారును. 

2 ఫీడరు కేడరు లోని రెగ్యులర్ ఇంక్రిమెంటు తేదికి ఆప్షన్ ఇచ్చే అవకాశము. వీరికి వేతన స్థిరీకరణ రెండు పర్యాయములు ( ఇనిషియల్ ఫిక్సేషన్ మరియు రీ-ఫిక్సేషన్ ) జరుగును.

ఇనిషియల్ ఫిక్సేషన్ : FR223(i) ప్రకారంగా పదోన్నతి తేదికి ఒక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. ఎరియర్సు పదోన్నతి తేది నుండి రెగ్యులర్ ఇంక్రిమెంటు తేదికి ముందు రోజు వరకు చెల్లిస్తారు.

రీ- ఫిక్సేషన్ : FR22B ప్రకారంగా ఆప్షన్ ఇచ్చిన రెగ్యులర్ ఇంక్రిమెంట్ తేదికి నార్మల్ ఇంక్రిమెంటుతో పాటుగా లోయరు కేడరులో ఒక ఇంక్రిమెంట్ మరియు హాయ్యర్ కేడరులో మరొక ఇంక్రి మెంటుతో పాటుగా మూడు ఇంక్రిమెంట్లుతో ఇంక్రిమెంట్ తేదీకి ఫిక్సేషన్ చేయుదురు.

గమనికః జి.ఓ.నెం.145 ఫైనాన్స్ తేది: 19-5-2009 ప్రకారంగా ఉద్యోగి నిర్ణీత సమయంలో ఆప్షన్ ఇవ్వకుంటే లాభదాయకంగా ఉండే ఆప్షన్ ఎంచుకొని వేతన స్థిరీకరణ చేయవలసిన భాద్యత డి.డి.ఓ.లదే. పదోన్నతి తేదికి తర్వాత ఎంత దగ్గరలో రెగ్యులర్ ఇంక్రిమెంట్ తేది ఉంటే అంతగా లాభదాయకం.

పదోన్నతి వారికి చెందిన జీతాల బిల్, ఫిక్సేషన్ చెందిన ఎరియర్సు బిల్కు జతచేయవలసిన డాక్యుమెంట్సు:

First Bill(Salary Bill):

1)Inner Sheet

2)Promotion Order

3) Original LPC

4) Relieving Report

5) Joining Report 6) If Necessary NDC

Second Bill (Initial Fixation)

1)Inner Sheet

2) Initial Fixation Order 

3)Option Form 

4)Promotion Order

Third Bill (Re-Fixation)

1) Inner Sheet 

2) Re-Fixed Order

3) Promotion Order

4) Initial Fixation Copy

NOTE: Only Single Fixation If getting 24 Yrs. Scale Employees

Download Complete Information

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top