Child Care Leave పై కొన్ని సందేహాలు వస్తున్నాయి.. కొంతమంది చైల్డ్ కేర్ లీవ్ ను పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా ఎంటైర్ సర్విస్ లో వాడుకోవచ్చు అని మెసేజ్ లు పెడుతున్నారు..
దీనికి వివరణ
👉దీనికి ఇప్పటి వరకు వచ్చిన ఉత్తర్వులు 3:
1. GO 132 (2016)
2. GO 33 (2022)
3. GO 199 (2022)
1 లో చైల్డ్ కేర్ లీవ్ 60 రోజుల వరకు (కనీసం 3 విడతలలో) మంజూరు చేయుటకు ఉత్తర్వులు వచ్చాయి. అందులోనే 18 సం లలోపు పిల్లలు ఉన్న తల్లులకు ఇది వర్తిస్తుంది అలాగే 22 సం లోపు వికలాంగ పిల్లలు ఉన్న తల్లులకు వర్తిస్తుంది అని ఇచ్చారు
2 లో పైన ఒకటి లో ఇచ్చిన ఉత్తర్వులలో అన్నీ కండిషన్ లను అలాగే ఉంచుతూ, 60 రోజుల పరిమితిని 180 రోజులు చేశారు (ఇక్కడ కనీసం 3 స్పెల్ లను అలాగే ఉంచారు)
3 లో .. ఈ 180 రోజుల పెంపు ఉత్తర్వులు 10 స్పెల్ లకు మించకుండా వాడుకోవాలి అని మార్పులు చేశారు
ఇక్కడ గమనించవలసిన నోట్ ఏంటంటే, ఉద్యోగి తన ఎంటైర్ సర్విస్ లో, తన పిల్లల వయస్సు 18 సం నిండనంత వరకు (22 సం వికలాంగ పిల్లల విషయంలో) దీనిని వాడుకోవచ్చు.
0 comments:
Post a Comment