LIC GJF: పేద విద్యార్థులకు వరం.. ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌!

 Golden Jubilee Scholarship Scheme- 2023 |  ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని ప్రోత్సహించేలా భారత జీవిత బీమా సంస్థ (LIC) అపూర్వమైన సహకారం అందిస్తోంది.


Golden Jubilee Scholarship Scheme- 2023 |  

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువులకు ఎల్‌ఐసీ సిల్వర్‌జూబ్లీ ఫౌండేషన్‌ (LIC GJF) భరోసా కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థుల నుంచి 'ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్‌-2023'కు https://licindia.in/ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన విద్యార్థులు జనవరి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఎవరు అర్హులు?

పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ విద్యను 2022-23 సంవత్సరానికి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిష్‌నకు అర్హులు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం, ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్, ఏదైనా ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5లక్షలు మించరాదు. వితంతువు/ఒంటరి మహిళలైతే కుటుంబ వార్షికాదాయం రూ.4లక్షలు మించరాదు.

స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థినులు 2022-23 సంవత్సరానికి పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా 10+2లో చేరాలనుకునే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. యూజీ కోర్సులకు మాత్రమే ఈ ఉపకార వేతనాలను అందిస్తారు. పీజీ కోర్సులకు ఇవ్వరు.

ఎంతమందికి ఇస్తారు?

దేశవ్యాప్తంగా ఒక్కో ఎల్ఐసీ డివిజనల్ సెంటర్‌కు 30 మందిని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరిలో 20 మంది (10 మంది బాలురు, 10 మంది బాలికలు)ని జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు; అలాగే, అర్హులైన మిగతా పది మందిని స్పెషల్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌కు ఎంపిక చేస్తారు.

ఎంత మొత్తం ఇస్తారు?

జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు మెడిసిన్‌ చదువుతున్న వారికైతే అర్హతలకు లోబడి ఏటా రూ.40వేలు ఇస్తారు. మూడు విడతలు (రూ.12000; రూ.12000; రూ.16000) చొప్పున ఈ మొత్తాన్ని విద్యార్థి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులైతే ఏడాదికి రూ.30వేలు ఇస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో (రూ.9000; రూ.9000; రూ.12000) చెల్లిస్తారు. గ్రాడ్యుయేషన్‌, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, డిప్లొమా, వొకేషనల్‌ కోర్సులు చేసేవారికైతే ఆ కోర్సు పూర్తయ్యేవరకు ఏటా రూ.20వేలు చొప్పున ఇస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో (రూ.6000; రూ.6000; రూ.8000) బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్‌, వొకేషనల్‌/డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో (రూ.4500; రూ.4500; రూ.6000) చెల్లిస్తారు.

కొన్ని నిబంధనలివే..

ఏవైనా ఇతర ట్రస్టులు/ సంస్థల నుంచి ఇప్పటికే స్కాలర్‌షిప్‌ పొందుతున్నవారైతే ఈ స్కాలర్‌షిప్‌నకు పరిగణనలోకి తీసుకోరు.

దూరవిద్యా కోర్సులు లేదా పార్ట్‌టైం తరగతుల్లో చేరే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ వర్తించదు. అలాగే, సీఏ/సీఎస్‌/ఐసీడబ్ల్యూఏ లేదా స్వీయ విద్యా కోర్సులు చేసేవారూ అనర్హులే.

స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 50శాతం మార్కులు సాధిస్తేనే తర్వాతి ఏడాదికి రెన్యువల్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

మెడిసిన్‌, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు, సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారు నిర్దేశించిన మార్కులను పొందితేనే మరుసటి సంవత్సరానికి స్కాలర్ షిప్ కొనసాగుతుంది. రెగ్యులర్ హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఒకవేళ కుటుంబంలో గర్ల్‌ చైల్డ్‌ ఉంటే ఇద్దరికీ అనుమతిస్తారు.

ఈ స్కాలర్‌షిప్‌ మంజూరు చేసినప్పుడు ఎల్‌ఐసీ విధించిన ఏ ఒక్క నిబంధనను ఉల్లంఘించినా సరే స్కాలర్‌షిప్‌ రద్దు అవుతుంది. తప్పుడు సమాచారం/నకిలీ సర్టిఫికెట్లతో ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు రుజువైతే అతడు/ఆమె స్కాలర్‌షిప్‌ను రద్దు చేయడంతో పాటు వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తారు.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ ఛానల్ లో చేరండి:

https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i

ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్:

https://t.me/apjobs9

పూర్తి వివరాలు ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు

Click Here to Apply LIC Golden Jubilee Scholarship

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top