Army Public School Jobs 2024 : గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు - అర్హతలు, ఖాళీల వివరాలివే

Army Public School Golconda Jobs 2024: టీచింగ్ తో పాటు పలు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రకటన విడుదల చేసింది. పోస్టుల వారీగా అర్హతలను పేర్కొంది. దరఖాస్తు ఫారమ్ ను ఆఫ్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 37 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టీజీటీ 13, పీజీటీ -7 ఉద్యోగాలు. ఇక పీఆర్టీలు 17 పోస్టులు ఉన్నాయి. https://www.apsgolconda.edu.in వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి…

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ సంస్థ - గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌

మొత్తం ఉద్యోగాలు - 37

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 07 పోస్టులు (English, Maths, Chemistry, Geography, Economics, Pol Science and Psychology))

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 13 పోస్టులు. (English (03), Hindi (01), Maths (02), Science (03) S Studies (03) and Computers (01))

ప్రైమరీ టీచర్ (పీఆర్టీ) - 17 పోస్టులు ఉన్నాయి.(మ్యూజిక్ (1), డాన్స్ (01), పీఈటీ(2), ఆర్ట్ (01), హెడ్ మాస్టర్ (01), ప్రి ప్రైమరీ టీచర్లు -10)

అర్హతలు - సంబంధిత విభాగంలో ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ పూర్తి చేయాలి. పీజీ, సీటీఈటీ/ సీటెట్ లేదా టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. హెడ్ మాస్టర్ పోస్టుకు సంబంధించి అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్

దరఖాస్తు రుసుం- రూ.100

ఎంపిక విధానం - అనుభవం ఆధారంగా నియామకాలు జరుపుతారు.

దరఖాస్తులు ఫారమ్ - https://www.apsgolconda.edu.in/forms.html  పై క్లిక్ చేసి పొందవచ్చు


అధికారిక వెబ్ సైట్ - https://www.apsgolconda.edu

దరఖాస్తు చివరితేది- జనవరి 20, 2024.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా చిరునామా: Army Public School Golconda, Hydersha kote, Near Suncity, Hyderabad-500031.

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top