CPS Partial Withdrawal Complete Details..| CPS Partial Withdrawal Application

CPS Partial Withdrawal Complete Details..| CPS Partial Withdrawal Application   CPS Partial withdrawadi ఎలా చేసుకోవాలి ?


CPS Partial Withdrawal Complete Details..| CPS Partial Withdrawal Application 

Pension Fund Regulatory and Development Authority PFRDA/2018/40/Exit Dt:10-01-2018 ప్రకారం NPS Partial withdrawal ఎలా చేసుకోవాలి ఉత్తర్వలు విడుదల చేసినారు. ఈ ఉతర్వుల ప్రకారం ఈ క్రింది సందర్భాలలో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఇస్తారు

> పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం చట్టబద్దం గా దత్తత తీసుకున్న పిల్లలకు కుడా వర్తిస్తుంది

> పిల్లల వివాహ నిమిత్తం చట్టబద్దం గా దత్తత తెసుకున్న పిల్లలకు కుడా వర్తిస్తుంది

> గృహ నిర్మాణ నిమిత్తం లేదా ప్లాట్ కొనుగోలు నిమిత్తం

>> చందాదారుడు, భార్య, పిల్లలు చందాదారుడు మీద ఆధారపడిన తల్లిదండ్రులు వైద్య ఖర్చులు నిమిత్తం కూడా ఉపసంహరించుకోవచ్చు

వర్తించే వ్యాధులు:-

a) Cancer b) Kidney Failure (End Stage Renal Failure) c) Primary Pulmonary Arterial Hypertension d) Multiple Sclerosis e) Major Organ Transplant f) Coronary Artery Bypass Graft g) Aorta Graft Surgery h) Heart Valve Surgery i) Stroke j) Myocardial Infraction k) Coma I) total blindness m)Paralysis n) Accident of serious/life threatening nature o) any other critical illness of a life threatening nature as stipulated in the circulars, guidelines of notifications issued by the Authority from time to time

పాక్షిక ఉపసంహరణకు నిబందనలు :-

> నూతన పెన్షన్ పథకంలో చేరిన మూడు సంత్సరాలు పూర్తి కాబడిన వారే అర్హులు

>చందదారుడు చెల్లించిన దానిలో దరఖాస్తు చేసేనాటికి ఉన్న దానిలో 25% వరకు మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఇస్తారు.

> ఎమైన నివాసం చందదారుడు పేర, సముక్తంగా కలిగి ఉన్నా కొత్తది కొనుగోలుకు ఈ నిధులు ఉపసంహించలేరు

గరిష్టం గా ఎన్ని సార్లు ఉపసంహరణ చేసుకోవ చ్చు :-

చందదారుడు తన సర్వీస్ మొత్తం లో గరిష్టంగా మూడు సార్లు మాత్రమే ఉపసంహరణకు అనుమతినిస్తారు.

చందాదారుడు ఉపసంహరణ కొరకు Central Recordingkeeping Agency & a National Pension System Trust కు దరఖాస్తు నోడల్ అధికారి ద్వారా సమర్పించాలిసి ఉంటుంది. చందాదారుడు అనారోగ్యం తో బాధ పడుచున్న సందర్భంలో వారి కుటుంబ సభ్యులలో ఎవరైనా చందాదారుడు తరుపున దరఖాస్తు సమర్పించవచ్చు. పాక్షిక ఉపసంహరణ కొరకు Form 601PW సమర్పించాలిసి ఉంటుంది

CPS Partial Withdrawal Application

Self Declaration Format for Partial Withdrawal



Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top