India Post GDS Recruitment 2024 : 10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ (India Post GDS Recruitment 2024) ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. గతేడాది జనవరిలో 40,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది ప్రకటన విడుదల కావాల్సి ఉంది. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (India Post Payments Bank)కు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు
.అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే.. నోటిఫికేషన్ విడుదల, పోస్టుల సంఖ్య, ముఖ్యమైన తేదీలు తదితర వివరాల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ క్షణమైనా India Post GDS Recruitment 2024 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది
0 comments:
Post a Comment