Bank Holidays In June : బ్యాంకు కస్టమర్స్ కి అలర్ట్.. జూన్ లో 10 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు.. ఎప్పుడెప్పుడంటే..

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), 2024 సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలోనే బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం, జూన్ నెలలో మొత్తం 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే జూన్ నెల బ్యాంకు సెలవుల జాబితాలో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు కూడా ఉన్నాయనే విషయాన్ని బ్యాంకు ఖాతాదారులు గుర్తుంచుకోవాలి. అలాగే ఈ సెలవుల జాబితాలోని కొన్ని సెలవులు దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుండగా, కొన్ని సెలవులు మాత్రం ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.


ఇక కింద తెలిపిన సెలవుల జాబితాను దృష్టిలో ఉంచుకుని, బ్యాంకు ఖాతాదారులు దానికి తగ్గట్టుగా తమ బ్యాంకు పనులకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవడం మంచిది. మరొకవైపు బ్యాంకులు ప్రతి నెలా మొదటి శనివారం, మూడవ శనివారం, అలాగే ఐదవ శనివారం తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉండగా రెండవ శనివారం, నాలుగవ శనివారం మాత్రం మూతపడతాయి.

అయితే సెలవు రోజుల్లో బ్యాంకులు మూతపడినప్పటికీ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్ లైన్ సర్వీసులు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా యధావిధిగా పని చేస్తాయని బ్యాంకులు తెలిపారు. అదేవిధంగా ఈ సెలవు రోజుల్లో బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్స్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని బ్యాంకులు తెలిపాయి.

జూన్ నెలలో బ్యాంకు సెలవులకు సంబంధించిన పూర్తి జాబితాను మీ కోసం కింద తెలియచేయడం జరిగింది.

జూన్ 02 : ఆదివారం

జూన్ 08 : రెండవ శనివారం

జూన్ 09 : ఆదివారం

జూన్ 15 : రాజా సంక్రాంతి ( మిజోరాం, ఒరిస్సా రాష్ట్రాలకు సెలవు)

జూన్ 16 : ఆదివారం

జూన్ 17 : బక్రి ఈద్ (దేశంలోని చాలా రాష్ట్రాలకు సెలవు)

జూన్ 18 : బక్రి ఈద్ (శ్రీనగర్, జమ్మూ లోని బ్యాంకులకు సెలవు)

జూన్ 22 : నాలుగవ శనివారం

జూన్ 23 : ఆదివారం

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top