LIC Saral Pension : 40 ఏళ్ల నుంచే పెన్షన్ పొందే అద్భుతమైన పథకం.. ఒక్కసారి పెట్టుబడి పెడితే నెలకు రూ. 12,400 పొందే అవకాశం..

 దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ అన్ని వర్గాల ప్రజలం కోసం ప్రత్యేక పాలసీలు తీసుకొస్తుంది. అయితే దాదాపు అన్ని పెన్షన్ పథకాలు సాధరణంగా 60 ఏళ్ల నుంచి ఉంటాయి. కానీ ఎల్ఐసీ మాత్రం 40 ఏళ్లకే పెన్షన్ పొందే అద్భుతమై పథకాన్ని అందిస్తోంది. అదే ఎల్ఐసీ సరళ్ పెన్షన్ స్కీం.


ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడితే తక్షణమే ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

* 40-80 ఏళ్ల వయసు వారు ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పథకాన్ని తీసుకునేందుకు అర్హులు

* పాలసీ తీసుకున్న వెంటనే మీరు పెన్షన్ పొందవచ్చు.

* ఈ పాలసీలో ప్రీమియం ఒక్కసారే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎంచుకున్న విధంగా పెన్షన్ పొందవచ్చు.

* ఈ పాలసీ తీసుకున్న వారు అకాల మరణం చెందితే డిపాజిట్ చేసిన మొత్తం నామినీకి వస్తంది.

పాలసీ తీసుకున్న ఆరు నెలల తర్వాత అవసరమైతే సరెండర్ చేసుకోవచ్చు.


సింగిల్ లైఫ్

జీవన్ సరళ్ స్కీంలో సింగిల్ లైఫ్ పాలసీ తీసుకుంటే మీరు బతికి ఉన్నంతవరకు పెన్షన్ వస్తుంది. మీ మరణాంతరం మీరు నామినేట్ చేసిన వ్యక్తికి మీరు డిపాజిట్ ను తిరిగి చెల్లిస్తారు.

జాయింట్ లైఫ్

ఈ స్కీంలో జాయింట్ పాలసీ స్కీం భార్తాభర్తలకైతే బాగుంటుంది. మీరు దీనిని ఎంపిక చేసుకుంటే మీరు బతికి ఉన్నంత వరకు పెన్షన్ పొందుతారు. మీ మరణానంతరం మీ భాగస్వామికి పెన్షన్ అందుతుంది. ఒకవేళ ఇద్దరూ మరణిస్తే మీరు నామినేట్ చేసిన వ్యక్తికి మీ డిపాజిట్ ను తిరిగి చెల్లిస్తారు.


కాగా ఈ పథకంలో నెలకు కనీసం రూ. 1,000 నుంచి పెన్షన్ పొందవచ్చు.

* ఈ స్కీంలో పెన్షన్ కు గరిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. మీరు ఎంత పెట్టుబడి పెడితే దానిని బట్టి పెన్షన్ వస్తుంది.

* నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి ఓసారి పెన్షన్ తీసుకునే ఆప్షన్లు ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి దీనిలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు.

ఉదాహరణకు 42 ఏళ్ల వ్యక్తి రూ. 30 లక్షల యాన్యూటీ తీసుకుంటే ప్రతి నెల రూ. 12,388 అంటే దాదాపు రూ. 12,400 పెన్షన్ గా పొందవచ్చు. మీరు బతికి ఉన్నంతవరకు నెలనెలా ఇంత మొత్తం వస్తుంది. ఒకవేళ మరణిస్తే రూ. 30 లక్షలు మీరు నామినేట్ చేసిన వ్యక్తికి చెల్లిస్తారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top