అమరావతే ఏపీకి రాజధాని : లోకేష్

 అమరావతే ఏపీకి రాజధాని అని, ఈ విషయంలో మరో యోచనే లేదని టీటీపీ నాయకుడు నారా లోకేశ్‌ స్పష్టంచేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఇక ముగిసిన ముచ్చటేనని ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడం వల్ల రాజధాని నిర్మాణం సహా తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను పూర్తిచేయలేకపోయామని తెలిపారు. ప్రస్తుతం అమరావతి పునర్నిర్మాణం చేపడుతామని లోకేశ్‌ తేల్చిచెప్పారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top