BSNL News: 50% తక్కువ రేటుకే బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్.. హడలిపోతున్న ప్రైవేట్ కంపెనీలు

 BSNL Recharge Plans: దేశంలోని టెలికాం రంగంలో దాదాపు 7 ఏళ్ల తర్వాత అంబానీని ఎదిరింటే స్థాయికి ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ చేరుకుంటోంది. ఇప్పటి వరకు వ్యాపారంలోని ఇతర ఆటగాళ్లను తొక్కుకుంటూ జియో ముందుకు సాగినప్పటికీ ఇకపై ఆ ఆట అంత సులువైనది కాదని తేటతెల్లం అయ్యింది.

ప్రస్తుతం అంబానీ తన కుమారుడు అనంత్ వివాహం కోసం ఏకంగా రూ.5 వేల కోట్లను వెచ్చించి దానిని తమ వద్ద వసూలు చేస్తున్నారని జియో యూజర్లు మండిపడుతున్నారు. జియో రేట్లు పెంచటం అదునుగా భావించిన వొడఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు కూడా సందట్లో సడేమియా అంటూ తమ టారిఫ్ రేట్లను దాదాపు 20-25 శాతం వరకు పెంచేశాయి. ఇది చాలా మంది వినియోగదారులను దేశంలో 4జీ టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు నడిచేలా చేస్తోంది. టాటాల సాహకారంతో వేగంగా దీనికి అడుగులు పడటం ప్రజల్లో సేవలపై నమ్మకం సైతం పెరుగుతోంది

ఈ క్రమంలో వినియోగదారులందరూ బీఎస్ఎన్ఎల్‌తో ఇతర ఆపరేటర్ల రేట్లను పోల్చి చూస్తున్నారు. ఇతర ఆపరేటర్లు ఛార్జీల మోత మోగించటంతో తాము ఎంత నష్టపోతున్నామో ప్రజలు గమనించే పనిలో పడ్డారు. బీఎస్ఎన్ఎస్ వార్షిక రీఛార్జ్ ప్లాన్ రూ.2395 కింద వినియోగదారులకు రోజూ 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్‌లు, అపరిమిత కాలింగ్ సేవలను 395 రోజులకు అందిస్తోంది. ఇది ఇతర ఆపరేటర్ల కంటే తక్కువ రేటుకే 13 నెలలు చెల్లుబాటు అయ్యే చౌకైన ప్లాన్. దేశంలోని ఇతర ఏ టెలికాం ఆపరేటర్ సైతం దీనికంటే తక్కువ రేటుకు వార్షిక ప్లాన్లను ఆఫర్ చేయటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు బీఎస్ఎన్ఎల్ కంటే ముందే 4జీ, 5జీ సేవలను దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చాయి



ఇదే క్రమంలో ఇతర ఆపరేటర్లు అందిస్తున్న ప్లాన్లను పరిశీలిస్తే.. ముందుగా రిలయన్స్ జియో తన వార్షిక ప్యాకేజ్ రూ.3599 ప్లాన్ కింద రోజూ 2.5జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అలాగే అపరిమిత కాలింగ్, రోజూ 100 ఎస్ఎమ్ఎస్ లు కూడా ఇస్తోంది. ఇదే క్రమంలో ఎయిర్ టెల్ తన రూ.3599 ప్యాక్ కింద 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ ఇంటర్నెట్ అందిస్తోంది. అలాగే కాల్స్ ఎస్ఎమ్ఎస్ సేవలు ఇతర ఆపరేటర్ల మాదిరిగానే ఉన్నాయి. ఇక చివరిగా బిర్లాలకు చెందిన వొడఫోన్ ఐడియా సంస్థ తన రూ.3699 ప్లాన్ కింద వినియోగదారులకు రోజూ 2.5 జీబీ డేటాను అందిస్తోంది. 365 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్యాక్ అపరిమిత కాలింగ్, ఎస్ఎమ్ఎస్ సేవలతో పాటు ఏడాది కాలానికి డిస్నీ+హాట్‌స్టార్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది.

తాజా సమాచారం కోసం టెలిగ్రామ్ మరియు వాట్సప్ గ్రూపులో చేరండి....

Whatsapp Group Link:

 https://whatsapp.com/channel/0029Va9TtOpFHWq3Ih0QM13Y

Telegram Group:

https://t.me/andhrateachers

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top