SVV University Tirupsthi Diploma Notification 2024-25

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ... 2024-25 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక పాలిటెక్నిక్లలో రెండేళ్ల డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 22వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు వివరాలు:

* పశుసంవర్దక పాలిటెక్నిక్లో రెండేళ్ల డిప్లొమా కోర్సు

సీట్ల సంఖ్య:

ప్రభుత్వ పాలిటెక్నిక్ లు: 330 సీట్లు

అనుబంధ (ప్రైవేట్) పాలిటెక్నిక్లు: 660 సీట్లు

మొత్తం సీట్లు: 990.

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా, వయోపరిమితి: 31-08-2024 నాటికి 15 మరియు 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.

దరఖాస్తు రుసుము: జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీలకు రూ.880. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులకు .440.

ముఖ్య తేదీలు..

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08-07-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-07-2024.

Download Notification

Official Website

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top