ట్రిపుల్ఎటీ రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి
త్వరలో మూడో విడత నిర్వహణ
ట్రిపుల్ ఐటీ నూజివీడు, శ్రీకాకుళం ప్రాంగణాల్లో 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో దశ జనరల్ కౌన్సెలింగ్ ప్రక్రియ నూజివీడు కళా శాలలో శుక్రవారం నిర్వహించారు. రెండు క్యాంపస్లకు కలిపి మొత్తం 238 మందిని కౌన్సె లింగ్కు పిలువగా 134 మంది ప్రవేశాలు పొందారు. ఇడుపులపాయ, ఒంగోలు ప్రాంగణా లకు ఇడుపులపాయలో నిర్వహించారు. ఈ రెండు ప్రాంగణాలకు కలిపి మొత్తం 518 మందిని కౌన్సెలింగ్కు పిలువగా 310 మంది ప్రవేశాలు పొందారు. మిగిలిన సీట్లకు త్వరలో మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ట్రిపుల్ IT ప్రవేశాల కన్వీనర్ ఆచార్య అమరేంద్ర కుమార్ తెలిపారు.
0 comments:
Post a Comment